Webdunia - Bharat's app for daily news and videos

Install App

సవాల్ స్వీకరించి రింగ్‌లోకి రాఖీ... గాలిలోకి లేపి కిందపడేసిన రెజ్లర్...

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (09:04 IST)
బాలీవుడ్ సెక్సీ క్వీన్ రాఖీ సావంత్ ఓ రెజ్లర్ చేతిలో తన్నులు తింది. దీంతో ఆమె నడుం నొప్పితో ఆస్పత్రిలో చేరింది. సీడబ్ల్యుఈ ఛాంపియన్‌షిప్‌ రెజ్లింగ్ పోటీల్లో భాగంగా, మహిళా రెజ్లర్ రోబెల్ చేసిన ఛాలెంజ్‌ను రాఖీ స్వీకరించింది. దీంతో మల్లయుద్ధం బరిలోకి దిగిన రాఖీ సావంత్‌ను మహిళా రెజ్లర్ రోబెల్ తన భుజాలమీదకు ఎత్తుకుని అమాంతం కింద పడేసింది. దీంతో రాఖీకి తీవ్ర గాయమైంది. ఈ ఘటన జరిగిన తర్వాత 8 నిముషాల పాటు రాఖీ బాధతో విలవిలలాడిపోయింది. 
 
చండీగఢ్‌లోని పంచకూలలోని తావూదేవి లాల్ స్టేడియంలో ఈ పోటీలు ఆదివారం జరిగాయి. తొలుత రింగ్‌లోకి దిగిన రోబెల్ పంచకూలలో తనతో తలపడే సత్తాగల మహిళ ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చని ఛాలెంజ్ చేసింది. దీనికి వెంటనే స్పందించిన రాఖీ సావంత్ రింగ్‌లోకి దూకింది. తరువాత రాఖీ... తనతో ఒక పాటకు నర్తించాలని రోబెల్‌కు ఛాలెంజ్ చేసింది. 
 
దీనికి ఆమె సై అంటూ డాన్స్ పూర్తిచేసింది. ఈ ఛాలెంజ్ ముగిసిన వెంటనే రోబెల్.. రాఖీని అమాంతం పైకెత్తి గాలిలోకి లేపి దబ్బున కింద పడేసింది. దీంతో రాఖీ గాయాల పాలైంది. ప్రస్తుతం రాఖీ జీరఖ్ పూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
 
నిజానికి ఈ ఘటన జరిగినపుడు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులంతా రాఖీ సీడబ్ల్యుఈ ఛాపింయన్‌షిప్ కార్యకర్త అనుకుని లైట్‌గా తీసుకున్నారు. కానీ, గేమ్ నిర్వాహకులు రాఖీ బాధపడుతుండటాన్ని గమనించి ఆమెను వెంటనే రింగ్ నుంచి బయటకు తీసుకువచ్చి, ఆసుపత్రికి తరలించడంతో ఈ విషయం వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం