Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తనూశ్రీ నన్ను రేప్‌ చేసింది.. ఆమె ఓ లెస్బియన్... లోపల అన్నీ మగబుద్ధులే..

Advertiesment
తనూశ్రీ నన్ను రేప్‌ చేసింది.. ఆమె ఓ లెస్బియన్... లోపల అన్నీ మగబుద్ధులే..
, శుక్రవారం, 26 అక్టోబరు 2018 (10:26 IST)
బాలీవుడ్‌లో మీటూ ఉద్యమంపై సరికొత్త వివాదం నెలకొనేలా కనిపిస్తోంది. మీటూ ఉద్యమాన్ని ప్రారంభించిన సీనియర్ నటి తనూశ్రీ దత్తాపై మరో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ సంచలన ఆరోపణలు చేసింది. తనను తనూశ్రీ దత్తా రేప్ చేసిందనీ, అదీ కూడా ఒక్కసారికాదు.. చాలాసార్లు రేప్ చేసినట్టు తెలిపింది. పైగా, ఆమె పైకి చూడ్డానికే అమ్మాయి.. కానీ లోపల మాత్రం అన్నీ మగబుద్ధులేననీ, అందువల్ల షీటూ ఉద్యమం కూడా రావాలని రాఖీసావంత్ కోరింది. 
 
ఈ అంశంపై రాఖీసావంత్ మాట్లాడుతూ, 'తనూశ్రీ దత్తా నన్ను రేప్‌ చేసింది. అదీ ఒకసారి కాదు.. చాలా సార్లు. ఓ అమ్మాయిని మరో అమ్మాయి రేప్‌ చేయడమేంటని అనుకోవద్దు. 377 చట్టాన్ని ఒకసారి గుర్తుచేసుకోండి. అయినా కొన్నేళ్ల క్రితం తనూ నన్ను రేప్‌ చేసిందని చెప్పడానికి నేను చాలా ఇబ్బందిపడుతున్నా' అని వ్యాఖ్యానించింది. ఈ ఘటన 12 యేళ్ల క్రితం జరిగిందని తెలిపింది. 'అందరూ మీటూ మీటూ అంటున్నారు. ఇక షీటూ ఉద్యమం కూడా రావాలి' అని వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, తనూశ్రీ దత్తా పైకి చూడ్డానికి మాత్రమే అమ్మాయని.. లోపల అన్నీ మగ బుద్ధులేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఓ అమ్మాయిగా ఈ పదాన్ని (రేప్‌) కూడా నేను వాడకూడదు. నా జీవితంలో జరిగిన ఈ అసభ్యకరమైన ఘటన గురించి చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. కలత చెందుతున్నాను. మానసికంగా వ్యధ చెందుతున్నాను. అప్పట్లో పేర్లు బయట పెట్టడానికి కూడా చాలా భయపడ్డాను. హత్య చేస్తామని, గ్యాంగ్‌ రేప్‌లు చేస్తామని నాకు బెదిరింపులు వచ్చాయి. నిజానికి 12 ఏళ్ల క్రితం తనూశ్రీ నా బెస్ట్‌ఫ్రెండ్‌. తనే నన్ను డ్రగ్స్‌ తీసుకోమని బలవంతపెట్టింది.
 
నేనప్పటిదాకా చాలా అమాయకంగా, సౌమ్యంగా ఉండేదాన్ని. రేవ్‌ పార్టీలో తంబాకును మద్యంలో కలుపుకొని తాగడం తనూకు అలవాటు. నాక్కూడా అలవాటు చేసింది. తను అమ్మాయా? అబ్బాయా? అనే విషయం పట్ల నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి' అని వ్యాఖ్యానించింది. 'తనూ నాలో పడుకుని ఉన్న నాగుపామును నిద్రలేపింది. తనేకాదు... ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చాలా మంది లెస్బియన్స్‌ ఉన్నారు. నేను వాళ్ల పేర్లను బయటపెట్టను. తనూ నా శరీరంపై ఎక్కడెక్కడ చేతులు వేసిందో కోర్టులోనూ చెబుతాను. తనూశ్రీ ఓ లెస్బియన్' అని రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''2.ఓ'' ట్రైలర్ రిలీజ్‌కు వేళాయే...