Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తను శ్రీ గురించి నాకు బాగా తెలుసు.. నానా అలాంటి వ్యక్తి కాదు.. వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రముఖ దర్శకుడు నానా పటేకర్‌పై తను శ్రీ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. నానా పటేకర్‌పై తను శ్రీ చేస్తున్న ఆరోపణలు తీసిపారేయలేమని.. అయితే మరొకరసారి తను ఎందుకు ఇలాంటి

Advertiesment
తను శ్రీ గురించి నాకు బాగా తెలుసు.. నానా అలాంటి వ్యక్తి కాదు.. వర్మ
, బుధవారం, 10 అక్టోబరు 2018 (14:42 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రముఖ దర్శకుడు నానా పటేకర్‌పై తను శ్రీ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. నానా పటేకర్‌పై తను శ్రీ చేస్తున్న ఆరోపణలు తీసిపారేయలేమని.. అయితే మరొకరసారి తను ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తుందో ఆలోచించుకుంటే మంచిదన్నాడు. ఎందుంకంటే నానా పటేకర్ అలాంటి వ్యక్తి కానేకాదన్నాడు. 
 
నానా లాంటి వ్యక్తిత్వం ఉన్న వారు చాలా అరుదు. కానీ ఆయన గురించి తెలియని వారు మాత్రం తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తాను కూడా మొదట్లో ఆయన ప్రవర్తనతో ఇబ్బంది పడ్డాను. సినిమా కథ చెప్పేందుకు వెళ్తే ఆయన హార్ష్‌గా ప్రవర్తించాడే కానీ.. అతడి ఉద్దేశం అలాంటి కాదని ఆర్జీవీ వెనకేసుకొచ్చాడు. 
 
నానాలాంటి వ్యక్తి హీరోయిన్ పట్ల తప్పుగా ప్రవర్తించారంటే నమ్మదగిన విషయం కాదని.. ఎందుకంటే నానా అలాంటి మనిషే కాదని రామ్ గోపాల్ వర్మ నొక్కి చెప్పాడు. తనుశ్రీ గురించి కూడా తనకు తెలుసు. మరోసారి ఆమె తను చేస్తోన్న ఆరోపణల గురించి ఆలోచిస్తే మంచిదంటూ ఆర్జీవీ వ్యాఖ్యానించాడు. ఆయనలో సగం నటుడు, సగం మంచి హ్యూమన్ బీయింగ్ కనిపిస్తాడు. ఆయన గురించి బాగా తెలిసిన వారు నానాను ఇష్టపడతారు. ఆయన ఒక స్పెషల్ పర్సన్... అంటూ వ్యాఖ్యానించాడు. 
 
పని విషయంలో నానా పాటేకర్ చాలా ఫ్యాషన్ ఉంటారు. ఎవరైనా సరిగా నటించక నిర్లక్ష్యం చేసినా.. సరిగ్గా పనిచేయకపోతే కొట్టడానికి కూడా వెళతాడు. ఇక చారిటీలో అతడు ఎంతో గొప్పవాడు. అతడి రెమ్యూనరేషన్ నాలుగో కోట్లు వస్తే అందులో రెండు కోట్లు తీసుకుని.. మరో రెండు కోట్లను నిర్మాత మూలంగానే ఛారిటీ ఇచ్చేయమంటారు. అలాంటి సేవాపరుడు నానా అంటూ రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మణిరత్నం చేతుల మీదుగా అనగనగా ఓ ప్రేమకథ పాట విడుదల(వీడియో)