Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#MeeToo మూమెంట్‌ని నేను సపోర్ట్ చేస్తున్నాను- సమంత (video)

Advertiesment
#MeeToo మూమెంట్‌ని నేను సపోర్ట్ చేస్తున్నాను- సమంత (video)
, మంగళవారం, 9 అక్టోబరు 2018 (11:52 IST)
దేశంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఓ వైపు ఊపందుకుంది. ప్రస్తుతం మీ టూ విప్లవం మొదలైంది. సెలెబ్రిటీలు తమకు ఎదురైన వేధింపుల గురించి సోషల్  మీడియా వేదికగా బహిర్గతం చేస్తున్నారు. ఈ క్రమంలో మీ టూపై టాలీవుడ్ అందాల రాశి సమంత స్పందించింది. ఇప్పటికే చాలామంది సినీతారలు మీ టూలో భాగంగా తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్తున్నారు.
 
హాలీవుడ్‌లో మొదలైన ఈ మీటూ విప్లవం.. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌కి కూడా పాడింది. టాలీవుడ్ ప్రముఖ సింగర్ చిన్మయి చిన్నతనంలో తను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి సోమవారం బయటపెట్టింది. 
 
తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఈ మీటూ ఉద్యమంపై స్పందించింది. మీటూ మూమెంట్‌లో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి మాట్లాడడానికి చాలామంది మహిళలు ధైర్యంగా ముందుకొస్తున్నందుకు సంతోషంగా ఉందని సమంత తెలిపింది. 
 
అంతేగాకుండా ఈ ధైర్యం కొనియాడదగిందని.. సమంత చెప్పింది. కానీ కొందరు వ్యక్తులు మాత్రమే ఇందుకు సానుకూలంగా స్పందించడం ఓకే కానీ.. కొందరు మహిళలు వారిని అవమానిస్తూ ఆధారాల గురించి అడగడం సిగ్గు చేటని సమంత వెల్లడించింది. #మీ టూ మూమెంట్‌ని నేను సపోర్ట్ చేస్తున్నాను'' అంటూ సమంత ట్వీట్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్‌లో మీ టూ ప్రకంపనలు.. అలోక్ నాథ్.. పచ్చి తాగుబోతు..