Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేంద్ర మంత్రి అక్బర్ తక్కువోడేం కాదు.. ఆ రిపోర్టర్‌ను కోర్కె తీర్చమన్నాడు...

Advertiesment
కేంద్ర మంత్రి అక్బర్ తక్కువోడేం కాదు.. ఆ రిపోర్టర్‌ను కోర్కె తీర్చమన్నాడు...
, బుధవారం, 10 అక్టోబరు 2018 (09:26 IST)
కేంద్ర మంత్రి విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పాత్రికేయుడు ఎంజే అక్బర్‌ చిక్కుల్లో పడ్డారు. ఈయన గతంలో ఒక పత్రికకు ఎడిటర్‌గా ఉన్న సమయంలో ప్రియా రమణి అనే పాత్రికేయురాలిని కోర్కె తీర్చాలంటూ వేధించారు. ఈ విషయం ఇపుడు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన్ను తక్షణం కేంద్ర మంత్రిపదవి నుంచి తప్పించాలని మరో కేంద్ర మంత్రి మేనకా గాంధీ డిమాండ్ చేస్తున్నారు.
 
ప్రస్తుతం బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం జోరుగా సాగుతున్న విషయం తెల్సిందే. ఈ ఉద్యమంలోభాగంగా, ప్రియా రమణి అనే పాత్రికేయురాలు తాను గతంలో ఎదుర్కొన్న అనుభవాలను మీడియాకు వెల్లడించింది. అక్బర్‌ ఒక పత్రిక ఎడిటర్‌గా ఉన్న సమయంలో తనను లైంగికంగా వేధించారంటూ ట్వీట్‌ చేశారు. 
 
నిజానికి గత ఏడాది హాలీవుడ్‌లో మీటూ ఉద్యమం మొదలైనప్పుడే ఆమె అక్బర్‌ లైంగిక వేధింపులపై వోగ్‌ పత్రికలో ఒక వ్యాసం రాశారు. కానీ, అప్పుడు ఆయన పేరు రాయలేదు. కానీ, ఇప్పుడు ఆయన పేరు ప్రస్తావించి మరీ ట్వీట్‌ పెట్టారు. ఆయనతో తనకేకాక చాలా మంది మహిళలకు భయంకరమైన అనుభవాలున్నాయని అందులో పేర్కొన్నారు. దీంతో మరికొందరు పాత్రికేయులు కూడా ఆయనపై ఆరోపణలు చేశారు.
 
ఈ ట్వీట్‌పై కేంద్ర మంత్రి మేనకా గాంధీ స్పందించారు. అక్బర్‌పై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అధికారంలో ఉన్న మగవారు తరచూ ఇలాంటివాటికి పాల్పడుతుంటారని.. ఇలాంటి తీవ్ర ఆరోపణలపై విచారణ జరిపించాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదారబాదులో దొంగ.. దొంగది.. దొరికితే కళ్లలో కారం చల్లేస్తారు...