సినీ పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు తమంతట తాముగా అంగీకరించే... మరిన్ని అవకాశాల కోసం పడకగదికి వెళ్తారని.. ఈ వ్యవహారంలో వారిని భయపెట్టేవారు, బలవంతం చేసేవారు, అత్యాచారాలకు పాల్పడే ఎవరూ వుండరని.. బాలీవుడ్ ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సినీ ఇండస్ట్రీలో 99 శాతం మంది హీరోయిన్లు, నిర్మాతలు తదితరులతో సెక్స్ చేసేందుకు అంగీకరించే వస్తారని రాఖీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
మహిళలను లైంగికంగా వాడుకునే విషయంలో కాస్టింగ్ డైరెక్టరకు బాధ్యత ఉంటుందని, సినిమా అవకాశాల కోసం వచ్చేవారు తొలుత వీరి వలలోనే పడతారని రాఖీ సావంత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో మగవారు ఆడవాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, ఒకసారి పడకగదికి వచ్చిన అమ్మాయి, ఆపై వారిని బెదిరించి, బ్లాక్ మెయిల్‌కు కూడా దిగవచ్చని రాఖీ సావంత్ హెచ్చరించింది.
కాగా, బాలీవుడ్‌లో మీటూ ఉద్యమాన్ని ప్రారంభించిన సీనియర్ నటి తనూశ్రీ దత్తాపై నటి రాఖీ సావంత్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను తనూశ్రీ దత్తా రేప్ చేసిందనీ, అదీ కూడా ఒక్కసారికాదు.. చాలాసార్లు రేప్ చేసినట్టు తెలిపింది. పైగా, ఆమె పైకి చూడ్డానికే అమ్మాయి.. కానీ లోపల మాత్రం అన్నీ మగబుద్ధులేననీ, అందువల్ల షీటూ ఉద్యమం కూడా రావాలని రాఖీసావంత్ కోరింది.