Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేట తర్వాత మురుగదాస్‌తో దర్బార్ చేస్తున్న రజనీ.. పోలీస్ ఆఫీసర్‌గా?

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (15:46 IST)
''పేట'' సినిమా తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ జాతీయ అవార్డు గ్రహీత ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. టైటిల్‌ని మురుగదాస్ అండ్ టీమ్ అధికారికంగా ఈ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.


దర్భార్ అనేది టైటిల్. రజనీకాంత్ నటిస్తున్న 167వ చిత్రమిది. అయితే కాలా ఫస్ట్‌లుక్‌ని దర్శకుడు పా. రంజిత్ ఎలా డిజైన్ చేయించాడో అదే విధంగా మురుగదాస్ `దర్బార్` ఫస్ట్‌లుక్‌ని డిజైన్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 
 
ముంబై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. బుధవారం నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ముంబైలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ముంబైలో భారీ సెట్‌ను డిజైన్ చేశారు.

ఈ చిత్రం కోసం రజనీపై చేసిన ఫొటోషూట్ లీకైన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న చిత్ర బృందం పక్కాగా ప్లాన్ చేసి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. కాగా సర్కార్ హిట్ తరువాత మురుగదాస్ .. పేట విజయం తరువాత రజనీ కలిసి చేస్తోన్న సినిమా కావడం వలన కూడా ఈ ప్రాజెక్టుపై అంతా దృష్టి పెట్టారు. 
 
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడనే టాక్ వచ్చింది. అందుకు తగినట్టుగానే ఈ పోస్టర్లో రజనీతో పాటు గన్స్, బుల్లెట్స్, పోలీస్ క్యాప్, పోలీస్ బెల్ట్, పోలీస్ డాగ్ కనిపిస్తున్నాయి.

ఈ లుక్ రజనీ లుక్ విభిన్నంగా వుంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా నయనతార కనిపించనుంది. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. అట్రాసిటీ కేసును కొట్టేసిన హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments