Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజినీకాంత్ ఎవర్ గ్రీన్ "నరసింహా"కు రెండు దశాబ్దాలు

Advertiesment
రజినీకాంత్ ఎవర్ గ్రీన్
, ఆదివారం, 24 మార్చి 2019 (10:49 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్, రమ్యకృష్ణ, సౌందర్య నటించిన చిత్రం "నరసింహా". ఈ చిత్రం విడుదలైంది 1999 ఏప్రిల్ 9వ తేదీన. వచ్చే నెల 9వ తేదీకి ఈ చిత్రం విడుదలై రెండు దశాబ్దాలు పూర్తిచేసుకోనుంది. రజినీకాంత్ సినీ కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌గా ఈ చిత్రం నిలిచింది. అలాంటి ఈ చిత్రాన్ని తరాలు మారినా ఏ ఒక్కరూ మరిచిపోలేరు. పైగా, సినీ ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం. కథ, డైలాగ్స్, యాక్షన్, మ్యూజిక్.. ఇలా అన్ని అంశాల్లో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. 
 
ఈ చిత్రంలోని 'నరసింహా' పాత్రలో రజనీకాంత్ అద్భుతంగా నటించగా, ఆయన స్టైల్, మేనరిజమ్, డైలాగులు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇందులో డైలాగులు ఇప్పటికీ ప్రతి ఒక్కరి నోళ్ళలో నానుతున్నాయి. 'నా దారి.. రహదారి!'.. అంటూ 'నరసింహ'లో రజనీకాంత్‌ పలికిన పంచ్‌ డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. 'అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది బాగు పడినట్లు చరిత్రలోనే లేదు' అనే డైలాగ్ కూడా చాలా ఫేమస్. 
 
ఇకపోతే, ఈ చిత్రంలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అదిరిపోయే నటన కనబరిచారు. నెగిటివ్ పాత్రలో రమ్యకృష్ణ తన నట విశ్వరూపం చూపించింది. సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ అందించిన మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. ఇందులోని పాటలన్నీ సూపర్ హిట్. కుటుంబం కోసం రజనీకాంత్ చేసిన త్యాగం, విలువలు, కష్టించే తత్వం.. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు కానుంది. అయినా ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. 20 యేళ్ళ క్రితం తమిళ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నరసింహా మిగిలిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను ఐరన్ లెగ్ కాదు.. ఎదుగుదలను అడ్డుకోలేరు : రకుల్ ప్రీత్ సింగ్