Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారి మాటలు చాలా పవర్... ఎందుకు స్పందించలేదో : వరలక్ష్మీ శరత్ కుమార్

Advertiesment
Varalaxmi
, ఆదివారం, 17 మార్చి 2019 (13:35 IST)
తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచ్చిలో యువతుల సామూహిక అత్యాచార ఘటనపై అనేక మంది స్పందించారు. కానీ, తమిళ సినీ పరిశ్రమకు చెందిన పెద్దలతో పాటు.. రాజకీయ నేతలు స్పందించలేదు. దీనిపై సినీ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఘాటైన విమర్శలు చేశారు. 
 
పొల్లాచ్చి సంఘటనను ఇప్పుటికే పలువురు తీవ్రంగా ఖండించారని, అందరూ ముఖ్యంగా ప్రభుత్వం అలాంటి మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాగే పలువురు సినీ ప్రముఖులు పొల్లాచ్చి సంఘటనపై తీవ్రంగా స్పందించారు. 
 
అయితే ఇంకా ఖండించని సినీ ప్రముఖులు ఉన్నారని, వారు ఎందుకు స్పందించలేదో అర్థం కావడం లేదని వరలక్ష్మీశరత్‌కుమార్‌ అంది. ఇటీవల మీటూ విషయంలోనూ తాను, గాయని చిన్మయి లాంటి వారు పోరాడామని, అయితే చాలా మంది ప్రముఖులు నోరు మెదపలేదని విమర్శంచింది.
 
నిజానికి ఇలాంటి ఘోర  సంఘటనలపై స్పందించడం ప్రముఖుల బాధ్యత అని పేర్కొంది. వారి స్పందనకు చాలా పవర్‌ ఉంటుందని అంది. దాని ప్రభావం చాలా ఉంటుందని అంది. కాబట్టి పొల్లాచ్చి సంఘటనలాంటి వాటిపై సినీ ప్రముఖులు స్పందించాలని వరలక్ష్మీశరత్‌కుమార్‌ అంటోంది. వరలక్ష్మీశరత్‌కుమార్‌ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందో అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి వస్తామంటున్న కొందరు పొల్లాచ్చి సంఘటనపై ఇంకా గొంతు విప్పలేదన్నది వాస్తవమన్నారు. 
 
ముఖ్యంగా రాజకీయాల్లోకి వస్తామని హడావుడి చేస్తున్న సినీ నటుడు రజినీకాంత్, హీరోలు అజిత్, విజయ్‌లు మాత్రం ఈ ఘటనపై నోరు మెదపడం లేదు. వీరిని లక్ష్యంగా చేసుకునే ఆమె విమర్శలు గుప్పించారని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముద్దుసీన్లలో మునిగి తేలిపోతున్న విజయ్ దేవరకొండ - రష్మిక (వీడియో)