సూపర్‌స్టార్ రజనీకాంత్ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ను కలిశారు. రజనీ శుక్రవారం సాలిగ్రాంలోని ఆయన నివాసానికి వెళ్లారు. విజయ్‌కాంత్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. విజయ్‌కాంత్‌ను కలిసిన తర్వాత రజనీకాంత్ విలేకరులతో మాట్లాడారు.
తనకు ఆరోగ్యం బాగా లేక రామచంద్ర హాస్పిటల్‌లో చేరినపుడు తనను చూసేందుకు వచ్చిన మొదటి వ్యక్తి విజయ్‌కాంత్ అని, అలాగే ఆయన అమెరికాలో చికిత్స తీసుకుంటున్నప్పుడే కలవాల్సి ఉన్నప్పటికీ కుదరకపోవడంతో ప్రస్తుతం ఆయన్ని కలుసుకున్నట్లు చెప్పారు.
విజయ్‌కాంత్‌ను కలుసుకోవడంలో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. ఇక రజనీ తన నివాసంలో కలిసిన సందర్భంగా దిగిన ఫోటోలను విజయ్‌కాంత్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇటీవల రజనీ ప్రకటించారు.
అలాగే ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదని స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయనున్నారట. ఇతర పార్టీ వర్గాల కోసం తన ఫోటోలను వాడొద్దని అభిమాన సంఘాలను కోరారు.