భారతీయ జనతా పార్టీతో పాటు అన్నాడీఎంకే సినీ స్టార్ రజినీకాంత్ తేరుకోలేని షాకిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓ ఒక్క పార్టీకి మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేశారు. అలాగే, తమ పేరు, తమ పార్టీ పేరును ఏ ఒక్కరూ వాడుకోవడానికి వీల్లేదని వెల్లడించారు. ఇది ఆ రెండు పార్టీలకు పెద్ద ఎదురుదెబ్బగా భావించాలి. వచ్చే ఎన్నికల్లో రజినీని తమవైపునకు తిప్పుకోవాలని ఈ రెండు పార్టీలు భావించాయి. వాటికి చెక్ పెట్టేలా రజినీకాంత్ పిలుపునిచ్చారు.
నిజానికి రజనీకాంత్ కొన్నాళ్ళ క్రితం తాను రాజకీయాలలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు తన పార్టీ పేరు ప్రకటించని రజనీకాంత్ రానున్న లోక్‌సభ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తాడా? లేదా? అనే దానిపై అభిమానులలో పలు సందేహాలు నెలకొన్నాయి. వీటిపై క్లారిటీ ఇచ్చారు.
లోక్‌సభ ఎన్నికలలో తాను పోటీ చేయనని, ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వమని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడమే తమ ఉద్దేశమని ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. "నా పేరు, గుర్తు ఎవరు వాడకూడదు . సమస్యల్ని పరిష్కరించే బలమైన, సుస్థిర ప్రభుత్వాన్ని ఎంచుకోండి" అని తలైవా పిలుపునిచ్చారు.