Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

త్వరలో హరీష్ రావు రాజీనామా.. త్వరలో సిద్ధిపేటకు బైపోల్... అభ్యర్థిగా శ్రీనిత?

Advertiesment
Harish Rao
, సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (10:56 IST)
తెలంగాణ రాష్ట్ర సమితిలో అత్యంత కీలక నేతల్లో ఒకరైన టి. హరీష్ రావు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. దీంతో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్ధిపేట అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా హరీష్ రావు భార్య శ్రీనిత పోటీ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
ఇదే అంశంపై సీఎం, తెరాస అధినేత కేసీఆర్ అన్న కుమార్తె, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆర్.రమ్యారావు ఒక ట్వీట్ చేశారు. ఇది ఇపుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా తెలంగాణ హెడ్‌లైన్‌తో కాంగ్రెస్ వాట్సాప్ గ్రూపులో రమ్యారావు ఈ పోస్ట్ చేశారు. మరో నాలుగు నెలల్లో సిద్ధిపేటకు ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా తన్నీరు శ్రీనిత పోటీ చేయనుందని ఆ పోస్ట్ సారాంశంగా ఉంది. ఇపుడు తెరాసతో పాటు.. తెలంగాణ రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఇది ఆసక్తికరంగా మారింది.
 
త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో హరీశ్ రావుతో పాటు.. కేసీఆర్ కూడా పార్లమెంట్‌కు పోటీ చేస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా, ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా హరీశ్ రావును తనతో పాటు ఢిల్లీ రాజకీయాలకు తీసుకెళ్లాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు. దీనిపై జోరుగానే ప్రచారం సాగుతోంది. ఇలాంటి తరుణంలో సిద్ధిపేటకు ఉపఎన్నిక.. శ్రీనిత పొలిటికల్ ఎంట్రీ అన్న వార్త తెరపైకి రావడం.. హరీశ్ లోక్‌సభకు పోటీ చేయించడం ఖాయమే అన్న వాదనకు బలం చేకూర్చేలా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండిగో సంస్థకు ఏమైంది.. విమాన సర్వీసులు నిలిపివేత...