Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టాలిన్ గారూ... మీకు సిగ్గులేదా : కమల్ హాసన్ ధ్వజం

స్టాలిన్ గారూ... మీకు సిగ్గులేదా : కమల్ హాసన్ ధ్వజం
, సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (15:02 IST)
డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌పై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను నాంది పలికిలిన గ్రామ సభలను కాపీ కొట్టేందుకు మీకు సిగ్గు లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. డీఎంకే అధినేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టాలిన్ గ్రామ సభల పేరిట ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
వీటిపై కమల్ హాసన్ స్పందిస్తూ, గత 25 ఏళ్లుగా గ్రామసభలు వున్నాయని, ఇంతకాలం తర్వాత స్టాలిన్‌కు గ్రామ సభలపై ఇంత మక్కువ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తాము పార్టీని ప్రారంభించిన రోజు నుంచి గ్రామాల్లో సంచరించి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని బహిరంగంగా పార్టీ నాయకులకు తెలియజేస్తున్నట్టు చెప్పారు. 
 
వారసత్వంగా రాజకీయాల్లోవున్న స్టాలిన్ ఇన్నేళ్లుగా గ్రామసభలను నిర్వహించడంపై ఆసక్తి చూపలేదని, ప్రస్తుతం ఓట్ల కోసమే ఈ సభలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. పైగా, ఇటీవలే పురుడు పోసుకున్న రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్న తాము నాందిపలికిన విషయాలను కాపీ కొట్టేందుకు సిగ్గులేదా అని కమల్ హాసన్ ప్రశ్నించారు.
 
అదేసమయంలో తాను ఒక ప్రత్యేక రాజకీయవాదినని, తన జీవితం తెరచిన పుస్తకమని, ఎవరైనా దానిని తెలుసుకునేందుకు వీలుగా వుంటుందన్నారు. తాము శాసనసభకు వెళితే చిరిగిన చొక్కాతో బయటకు రామని, నాగరికతగా మరో చొక్కాను మార్చుకుని ప్రజలు, మీడియా ముందుకు వచ్చేవాడినన్నారు. స్టాలిన్‌ లాగా అనాగరికంగా వ్యవహరించేవాడిని కాదని గుర్తుచేశారు. తమిళుడు అన్నది ఓ అర్హత కాదని, ఒక చిరునామా మాత్రమేనని, తాము రాజకీయాల్లో ప్రజలకు ఎంత చేశామన్నదే ప్రధానమైనదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశ్మీర్‌లో అలా చేయండి.. స్టాలిన్, రజనీకాంత్‌ను ఏకేసిన కమల్ హాసన్