Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ నటులందరూ రాజకీయాల్లోకి వస్తే ఇండస్ట్రీ ఏమౌతుంది..? రజినీకాంత్?

Advertiesment
సినీ నటులందరూ రాజకీయాల్లోకి వస్తే ఇండస్ట్రీ ఏమౌతుంది..? రజినీకాంత్?
, శనివారం, 16 మార్చి 2019 (22:11 IST)
పార్లమెంటు ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని రజినీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులందరూ తీవ్రంగా మనస్థాపానికి గురయ్యారు. రజినీ ఉన్నట్లుండి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అసలు ఎవరూ ఊహించలేదు. కానీ రజినీకాంత్ అసలు అసెంబ్లీలో కూడా పోటీ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారట. అసలు రాజకీయాల్లోకి ఎందుకు. ఇప్పుడున్న పరిస్తితుల్లో రాజకీయాల్లోకి వెళ్ళడం అనవసరం అనుకుంటున్నారట రజినీ.
 
తన సన్నిహితులతో ఇప్పటికే ఆయన మాట్లాడారట. అసలు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళాలని కుటుంబ సభ్యులనే ఆయనే ప్రశ్నించారట. ఇప్పుడు సినీపరిశ్రమలోనే హాయిగా ఉంది. తీసిన సినిమాలను ప్రజలు ఆదరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు రాజకీయం. నా స్నేహితుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి వెళుతున్నాడుగా.. మళ్లీ నేనెందుకు.. సినీ నటులందరూ సినిమాల్లోకి వెళితే సినీపరిశ్రమల ఏమైపోతుందని కూడా తన కుటుంబసభ్యులను ప్రశ్నించారట రజినీ. 
 
గతంలో తానే రాజకీయాల్లోకి వెళతానని చెప్పిన రజినీ ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోతున్నారట. మీ ఇష్టం వచ్చినట్లు చేయండని సలహా కూడా ఇచ్చారట. మరి చూడాలి రజినీకాంత్ రాజకీయాలకు సంబంధించి నిజంగానే వెనక్కి తగ్గుతారో లేక మళ్ళీ ఆలోచించి ముందుకు వెళతారో..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగనన్నా... నాకు ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేస్కుంటా