Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో 2.O - 47 వేల త్రీడీ స్క్రీన్లలో రజనీకాంత్ సినిమా.. (video)

Rajinikanth
Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (13:17 IST)
భారతీయ సినిమాలకు చైనాలో మంచి మార్కెట్ వుంది. దంగల్ సినిమా చైనాలో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదే తరహాలో బాహుబలికి కూడా చైనాలో మంచి ఆదరణ లభించింది. 


తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన టూపాయింట్ఓ సినిమాను చైనాలో విడుదల చేయనున్నారు. చైనాలో త్రీడీ థియేటర్లు మస్తుగా వుండటం ద్వారా అక్కడ రోబో సీక్వెల్ కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని సినీ యూనిట్ ఆశిస్తోంది. 
 
ఇందులో భాగంగా రజనీకాంత్, శంకర్ కాంబోలో తెరకెక్కిన 2పాయింట్ఓ సినిమాను చైనాలో విడుదల చేయనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ మేరకు చైనాకు చెందిన ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ హెచ్‌వై మీడియాతో కలిసి లైకా ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది. 
 
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హాలీవుడ్ స్టూడియోస్‌గా పేరొందిన సోనీ, 20యత్ సెంచరీ ఫాక్స్, వార్నర్ బ్రోస్, యూనివర్శల్, డిస్నీలతో సంబంధాలున్న హెచ్‌వై మీడియా సంస్థ చైనాలో 56వేల థియేటర్లలో (ఇందులో త్రీడీ స్క్రీన్లు కలిగిన 47వేల థియేటర్లున్నాయి) ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. ఇందు కోసం 2పాయింట్ఓను చైనా భాషలోకి డబ్ చేస్తున్నారు. 
 
వచ్చే ఏడాది మే 19వ తేదీన ఈ సినిమా చైనాలో విడుదల కానుంది. త్రీడీ వర్షన్‌లో విడుదలయ్యే భారతీయ సినిమా 2పాయింట్ఓ అక్కడ భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని లైకా ప్రొడక్షన్స్ వెల్లడించింది. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా లైకా ప్రొడక్షన్స్ హెచ్‌వైతో చేతులు కలిపిందని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments