Publish Date: Wed, 05 Dec 2018 (08:51 IST)
Updated Date: Wed, 05 Dec 2018 (08:52 IST)
మేషం: కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచడం మంచిది. ఉద్యోగస్తులకు ఏమరుపాటుతనం వలన అధికారులతో మాటపడవలసి వస్తుంది. కొన్ని వ్యవహారాలు మీ అంచనాలకు విరుద్ధంగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి పనివారలతో ఇబ్బందులు తప్పవు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
వృషభం: ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుండి అభ్యంతరాలెదురవుతాయి. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకోవలసి ఉంటుంది. మీ పాత సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. మీ సంతానం ఆలోచనలు పక్కదారి పట్టకుండా జాగ్రత్త వహించండి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం.
మిధునం: కంది, మినుము, పెసర, నూనె వ్యాపారస్తులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ప్రేమికుల్లో నూతనోత్సాహనం చోటు చేసుకుంటుంది. సినిమా, సంగీత, నృత్య కళాకారులకు సన్మానాలు వంటివి జరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు తప్పవు.
కర్కాటకం: నూతన వ్యాపారాభివృద్ధికి చేయు పథకాలు, ఆలోచనలు సత్ఫలితాలిస్తాయి. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. రుణాలు, చేబదుళ్ళు తప్పవు. మీ కదలికలపై కొంతమంది నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుగుణంగా వచ్చే సూచనలున్నాయి.
సింహం: వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. కుటుంబీకుల మధ్య ప్రేమ, వాత్సల్యాలు పెంపొందుతాయి. ముఖ్యుల సలహా పాటించడం మంచిదని గమనించగలరు. ధనం సమయానికి సమకూరడం వలన మీలో నూతన ఉత్సాహం కానరాగలదు. మీ అశక్తతను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు.
కన్య: స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. విద్యుత్ రంగాల్లో వారు మాటపడతారు. చిన్న తరహా పరిశ్రమ, కుటీర పరిశ్రమల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి. గృహంలో మార్పులు, చేర్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడుతాయి.
తుల: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారు అచ్చుతప్పుల వలన మాటపడతారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. సన్నిహితుల నుండి కానుకలు అందుకుంటారు. తినుబండారాలు, పండ్లు, బేకరి, వస్త్ర వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది.
వృశ్చికం: ఉత్తరప్రత్యుత్తరాలు సమర్థంగా నిర్వహిస్తారు. నూతన కాంట్రాక్టులు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. కార్యాసాధలో జయం ప్రముఖులతో పరిచయాలు వంటి శుభపరిణామాలున్నాయి. వాహనం నడుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు అవసరం. గృహంలో ఒక శుభకార్యం దిగ్విజయంగా పూర్తిచేస్తారు.
ధనస్సు: హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. ప్రైవేటు సంస్థల్లో వారి నిర్లక్ష్య ధోరణి వలన మాటపడక తప్పదు. తొందరపాటు నిర్ణయాలు, చర్యలు ఇబ్బందులకు దారితీస్తాయి. నిరుద్యోగులకు ఒక అవకాశం చేజారిపోయే అవకాశం ఉంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
మకరం: వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి పనివారి వలన ఇబ్బందులు తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. మీ కళత్ర మెుండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు వస్త్ర లాభం, ధనప్రాప్తి వంటి శుభపరిణామాలున్నాయి. క్రయవిక్రయ రంగాల్లో వారికి సామాన్యం. బంధువులతో చికాకులు తలెత్తుతాయి.
కుంభం: ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. స్త్రీల వాక్‌చాతుర్యానికి, ప్రతిభకు గుర్తింపు లభించగలదు. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారస్తులకు సమస్యలు తలెత్తుతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం.
మీనం: వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. మీ ముఖ్యుల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన సమస్యలు తలెత్తుతాయి.