Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శనివారం (01-12-2018) దినఫలాలు - నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని...

Advertiesment
శనివారం (01-12-2018) దినఫలాలు - నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని...
, శనివారం, 1 డిశెంబరు 2018 (08:50 IST)
మేషం: ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. కొబ్బరి, పండ్లు, కూరగాయల, ధాన్య స్టాకిస్టులకు లాభదాయకంగా ఉంటుంది. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. కొంతమంది మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా వ్యవహరిస్తారు. బంధుమిత్రుల రాకపోక వలన గృహంలో అసౌకర్యానికి లోనౌతారు. 
 
వృషభం: నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవడం శ్రేయస్కరం. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. భాగస్వామిక చర్చలు, ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో ఒత్తిడి, చికాకు కలిగిస్తుంది.  
 
మిధునం: సభా, సమావేశాలలో ప్రముఖులతో పరిచయాలేర్పడుతాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు తమ ఖాతాదారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలు ఉదరం, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. ఆలయాలను సందర్శిస్తారు.  
 
కర్కాటకం: కొత్త వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు. రుణం ఏ కొంతైనా చెల్లించాలన్న మీ యత్నం ఫలిస్తుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు అధికారుల నుండి వేధింపులు వంటివి తప్పవు. ద్విచక్ర వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్థిరచరాస్తుల విషయంలో పునరాలోచన మంచిది.  
 
సింహం: గృహ నిర్మాణాలలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉద్యోగస్తులు అధికారులకు మరింత సన్నిహితమవుతారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావడం మంచిది.  
 
కన్య: కొబ్బరి, పండ్లు, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. మన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. బంధుమిత్రులు మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. పత్రికా సంస్థలలోని వారు ఎంత శ్రమించినా గుర్తింపు ఏమాత్రం ఉండదు.   
 
తుల: వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, బేకరీ వ్యాపారులకు పురోభివృద్ధి. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదు. కొన్ని పనులు అసంకల్పితంగా పూర్తిచేస్తారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వలన స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. దైవ, సామాజిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. దూర ప్రయాణాలు అనుకూలం.  
 
వృశ్చికం: ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. స్త్రీలకు చికాకులు తప్పవు. రాజీమార్గంతో కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఒక వేడుకను ఘనంగా చేయడానికి సన్నాహాలు మెుదలెడతారు.  
 
ధనస్సు: వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాల దిశగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు నుండి అభ్యంతరాలెదుర్కోవలసివస్తుంది. మీ సమర్థత, నిజాయితీలు అందరినీ ఆకట్టుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబీకులకు తెలియజేయడం మీ బాధ్యతగా భావించండి. ప్రముఖులను కలుసుకుంటారు.  
 
మకరం: విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత కుదురుతుంది. పాతమిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడుతారు. చేపట్టిన పనులు మెుక్కుబడిగా పూర్తిచేస్తారు. స్టాక్‌మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. నిరుద్యోగుల నిరుత్సాహం విడనాడి శ్రమించి సత్ఫలితాలు పొందగలరు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు.     
 
కుంభం: కుటుంబ, ఆర్థిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రియతములకు శుభాకాంక్షలు అందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మిమ్ములను కాదన్నవారే మీకు చేరువయ్యేందుకు యత్నిస్తారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. బంధువుల రాక మీక ఉల్లాసాన్ని కలిగిస్తుంది.   
 
మీనం: హోటల్, క్యాటరింగ్ పనివారలకు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. తలపెట్టిన పనిలో ఆటంకాలు, చికాకులు ఎదురైనా తెలివితో పరిష్కరిస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ చాలా అవసరమని గమనించండి. ఆపద సమయంలో ఆత్మీయుల తోడ్పాటు మీకు మనో ధైర్యాన్నిస్తుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శని దోషం పోయేందుకు ఏడు శనివారాల పూజ... ఎలా చేయాలి?