ఆస్ట్రేలియాలో ఓ చిచ్చర పిడుగు సరికొత్త రికార్డును నెలకొల్పాడు. అండర్-19 క్రికెట్ విభాగంలో ఆకాశమే హద్దుగా ఆ బుడతడు రెచ్చిపోయాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదడమే కాకుండా 115 బంతుల్లో 17 సిక్సర్లతో 207 పరుగులు చేసి దుమ్మురేపాడు. ఆ కుర్రోడి పేరు ఓలీవర్ డెవిస్.
న్యూసౌత్ వేల్స్ తరపున నార్తర్న్ టెరిటరీపై గ్లాండోర్ ఓవల్‌లో ఈ ఘనత సాధించాడు. అండర్-19 విభాగంలో ఆడుతున్న డెవిస్ 115 బంతుల్లో 207 పరుగులు చేశాడు. ఇందులో 17 సిక్సర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో కేవలం 74 బంతుల్లో సెంచరీ కొట్టిన ఈ 18 యేళ్ల కుర్రోడు. ఆ తర్వాత వంద పరుగులను కేవలం 39 బంతుల్లో పూర్తి చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆఫ్‌స్పిన్నర్ జాక్ జేమ్స్ వేసిన ఓవర్లో 36 రన్స్ చేశాడు. అంటే ఒకే ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేశాడు. దీంతో అండర్-19 ఛాంపియన్‌షిప్స్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా నిలిచాడు. ఒలీవర్ ఘనతతో ఆ టీమ్ 168 రన్స్ తేడాతో విజయం సాధించింది.