గోళ్లు కొరికే దురలవాటు ఉంటే కేన్సర్ ఖాయం...
చాలా మందికి గోళ్లు కొరికే దురలవాటు ఉంటుంది. ఈ అలవాటు కారణంగా కేన్సర్ వ్యాధి బారినపడే అవకాశం ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. పైగా, గోళ్లు కొరికే అలవాటు ఏమాత్రం మంచిది కాదని వారు అంటున్నారు.
చాలా మందికి గోళ్లు కొరికే దురలవాటు ఉంటుంది. ఈ అలవాటు కారణంగా కేన్సర్ వ్యాధి బారినపడే అవకాశం ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. పైగా, గోళ్లు కొరికే అలవాటు ఏమాత్రం మంచిది కాదని వారు అంటున్నారు.
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌కు చెందిన కోర్ట్నీ విస్టోర్న్ అనే 20 యేళ్ళ యువతికి చిన్న వయసు నుంచి గోళ్లు కొరికే అలవాటు ఉంది. ఈ అలవాటు చివరికి వేళ్ల చివర్లను కొరికే వరకూ దారితీసింది. వేళ్ల నుంచి రక్తస్రావం అయ్యేది. అయినప్పటికీ ఆ అలవాటును మాత్రం మానలేక పోయింది.
ఈ తల్లిదండ్రులకు చెప్పేందుకు ఆమె భయపడిపోయి వేళ్లను వారికి కనబడకుండా దాచుకునేది. దీనికితోడు మార్కెట్‌లో లభ్యమయ్యే కృత్రిమ గోళ్లను పెట్టుకోవడం ప్రారంభించింది. నాలుగేళ్లుగా ఇలా చేయసాగింది. చివరకు ఆ గోళ్లు నల్లని రంగులోకి మారిపోయాయి. దీంతో వైద్యుల వద్దకు తీసుకెళ్లగా, ఆమెను పరిశీలించిన వైద్యులు స్కిన్ కేన్సర్ బారిన పడిందని వెల్లడించారు.
దీనిపై కోర్ట్నీవిస్టోర్న్ స్పందిస్తూ, 'గోళ్లు కొరికే దురలవాటు కారణంగా క్యాన్సర్ బారిన పడ్డాను. ఈ అలవాటు ఇలాంటి పరిస్థితికి దారితీస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు' అని వ్యాఖ్యానించింది. కాగా క్యాన్సర్ బారిన పడిన కోర్ట్నీ విస్టోర్న్‌కు ఇప్పటివరకూ నాలుగు సర్జరీలు జరిగాయి.