Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేపలను తింటుంటే ఆ సామర్థ్యం విపరీతంగా పెరుగుతోందట...

చేపలను తినడం ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని, ఇంకా చేపల్లో విటమిన్లు, ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయని తెలిసిన విషయమే. అయితే ఇవే కాకుండా చేపలను క్రమంతప్పకుండా తినడం వల్ల శృంగార సామర్థ్యం పెరగడంతో పాటు గర్భధారణ అ

Advertiesment
చేపలను తింటుంటే ఆ సామర్థ్యం విపరీతంగా పెరుగుతోందట...
, బుధవారం, 22 ఆగస్టు 2018 (15:12 IST)
చేపలను తినడం ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని, ఇంకా చేపల్లో విటమిన్లు, ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయని తెలిసిన విషయమే. అయితే ఇవే కాకుండా చేపలను క్రమంతప్పకుండా తినడం వల్ల శృంగార సామర్థ్యం పెరగడంతో పాటు గర్భధారణ అవకాశాలు మెరుగుపడుతున్నాయని కూడా కనుగొన్నారు.
 
జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ & మెటబాలిజం పత్రిక 2005 నుంచి 2009 వరకు దాదాపు వెయ్యికి పైగా జంటలపై అధ్యయనం చేసి, ఈ విషయాన్ని కనుగొన్నారు. ఈ అధ్యయనంలో ఆహారంలో చేపలను తినేవారు, తిననివారు అని రెండుగా విభజించారు. ఒక నెల రోజుల వ్యవధిలో ఎనిమిది కంటే ఎక్కువసార్లు చేపలను తినే వారిలో మిగిలిన వారితో పోల్చితే లైంగిక సామర్థ్యం విపరీతంగా పెరగడం, గర్భధారణ అవకాశాలు 47% పెరగడం గమనించారు.
 
నెల రోజుల్లో ఎనిమిది కంటే ఎక్కువసార్లు చేపలను తీసుకునే స్త్రీ, పురుషులు మిగిలిన వారితో పోల్చితే తమ భాగస్వామితో 22% ఎక్కువగా శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు అధ్యయనం ద్వారా తెలిసింది. అయితే ఈ అధ్యయనం ఏవో కొన్ని రకాల చేపలకే పరిమితం కాలేదు, అన్ని రకాల చేపలను తీసుకునే వ్యక్తులపై రుజువైంది, కాబట్టి అన్ని రకాల చేపలూ ఈ విషయంలో ప్రయోజనం చేకూర్చేవే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవగాహన లేని వ్యాయామం నిష్ఫలం... ఎందుకంటే...