గ్రేట్ డైరెక్టర్ శంకర్ సినిమా ఎంత భారీ స్ధాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజా చిత్రం 2.0 దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. రికార్డు స్ధాయి కలెక్షన్స్‌తో 2.0 దూసుకెళుతోంది. ఈ సినిమా తర్వాత శంకర్ భారతీయుడు 2 తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కమల్ హాసన్ నటించే ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే... శంకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారట.
ఇంతకీ విషయం ఏంటంటే.. బారతీయుడు 2 సినిమాలో గ్రాఫిక్స్‌ని నమ్ముకోవట్లేదట. గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీయాలనుకుంటున్నాడట. భారతీయుడులో లాగే ఇందులో సమాజంలో పేరుకుపోయిన అవినీతి మీద కథ నడుస్తుందట. కాకపోతే భారతీయుడు ఈ కాలంలో ఉన్న టెక్నాలజీ ఎలా వాడుకుంటాడు, పోలీసులకు ఇంకెంత సవాల్ విసురుతాడు అన్న అంశాలు అదనంగా ఉండబోతున్నాయంట. మరి.. ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.