Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కుమార్తెలు వారికి నచ్చిన విధంగా ఉంటున్నారు : రజనీకాంత్

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (16:38 IST)
తన ఇద్దరు కుమార్తెల వ్యక్తిగత జీవితాలపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ జీవితంలో సంతోషంగా ఉందని, పైగా, వారికి నచ్చిన విధంగా ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
 
రజనీకాంత్ - అక్షయ్ కుమార్‌లు నటించి శంకర్ దర్శకత్వం వహించిన "2.O" చిత్రం నవంబరు 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ విజయం సక్సెస్‌లో రజనీకాంత్ ఫ్యామిలీ మునిగిపోయివుంది.
 
ఈ నేపథ్యంలో తన జీవిత భాగస్వామి లతా రజనీకాంత్, ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్యల, సౌందర్యల గురించి రజనీకాంత్ తన మనసులోని మాటను వెల్లడించారు. తన జీవితంలో తన భార్య చాలా కీలకమైన పాత్ర పోషించారన్నారు. లత ఓ స్నేహితురాలిలా వెన్నంటే ఉన్నారని చెప్పారు. 
 
ముఖ్యంగా, పిల్లల బాధ్యతలు, ఇంటి పనులు మొత్తం ఆమే చూసుకుంటుంది. ఓ స్నేహితురాలిలా నాకు సహాయం చేస్తుంది. కొన్నిసార్లు తత్వవేత్తలా సూచనలు ఇస్తుంటుందని చెప్పారు. అలాగే, తన ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య ధనుష్‌, సౌందర్యల గురించి స్పందిస్తూ, 'వారిద్దరు సంతోషంగా ఉన్నారు. జీవితంలో వారికి నచ్చిన విధంగా ఉంటూ.. ఎంజాయ్‌ చేస్తున్నారు' అని తెలిపారు. 
 
ఇదిలావుండగా, రజనీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం పేట. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సిమ్రాన్, త్రిషలు హీరోయిన్లు. విజయ్ సేతుపతి, బాబిసింహా, శివకుమారు, సీనియర్ దర్శకుడు మహేంద్రన్ వంటి పెద్ద తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా, ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments