భార్య కోరికల్లో ముఖ్యమైనవి ఏంటో తెలుసా..? ఆడవాళ్ళ సాధారణ కోరికల్లో భర్త తనమాటే వినాలనుకోవడం ఒకటి. మన జీవితంలో ఆచరించాల్సివన్నీ మహాభారతంలో కనబడతాయి. భర్త ప్రేమను పొందుతూ అతను తనకు లొంగి ఉండాలంటే భార్య ఏం చేయాలి అన్నదానికి చాలామంది మహిళలకు అర్థం కాని ప్రశ్నలా మిగిలిపోతోంది.
అయితే భర్త తన మాటే వినాలంటే ఏం చేయాలో ద్రౌపది చాలా చక్కగా సత్యభామకు వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు. ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి వద్దా సంభాషించకూడదు. భార్యాభర్త దాంపత్య విషయాలు కూడా ఎవరితో ముచ్చటించరాదు.
కొందరు స్త్రీలు తమ భర్త తమకు లొంగాలని కోరుకుంటారు. దాని కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తారు. కానీ భర్త వసీకరణకు లొంగరు. కొందరు ఆగ్రహంతో, గర్వంతో ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటారు. ఇలా చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ కలుగదట.
భర్త, భార్య మాట వినాలంటే తనను ప్రేమగా చూసుకోవాలి. అతని మనస్సులోని కోర్కెను ముందుగానే గ్రహించాలి. ఒక తల్లి కొడుకును ఎలా చూసుకుంటుందో అలాగే భర్తకు కూడా సేవలు చేయాలి. భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే భర్తకు కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి. భర్త భోజనం చేసేటప్పుడు భార్య చక్కగా అలంకరించుకుని ఆయనకు తల్లి వలె భోజనం వడ్డించాలి. ఇతరుల ముందు భార్య పగలబడి నవ్వకూడదు. ఇది ఏ భర్తకు నచ్చని విషయం. ఉదయం ముఖం కడుక్కోకుండా భర్తతో భార్య మాట్లాడకూడదు. ఇలా చేస్తే భర్త మీ మాట వినడమే కాకుండా అతను చేసే ప్రతి పనిని భార్యకు చెబుతారట.