Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను పికప్ చేస్కుంటానన్నా నా భార్య వాడి బైకెక్కుతోంది... ఏం చేయాలి?

Advertiesment
నేను పికప్ చేస్కుంటానన్నా నా భార్య వాడి బైకెక్కుతోంది... ఏం చేయాలి?
, శుక్రవారం, 30 నవంబరు 2018 (11:58 IST)
నా ప్రాణ స్నేహితుడు, నా భార్య ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. నేను వేరే కంపెనీలో పనిచేస్తున్నాను. అప్పుడప్పుడు నాకు కుదరని పరిస్థితుల్లో నా భార్య అతడి బైక్ ఎక్కి ఆఫీసుకు వెళుతోంది. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కూడా అలాగే వస్తోంది. ఇదివరకు నేను వెళ్లి తీసుకువచ్చేవాడిని. ఈమధ్య నేను పికప్ చేసుకుంటానని ఫోన్ చేస్తే... ఎందుకు అవసరంగా అంత దూరం నుంచి కష్టపడి రావడం. నేను మీ స్నేహితుడి బండి మీద వచ్చేస్తానులే అంటోంది.


వాడి బైకు మీద ఆమె అలా రావడం నాకు అనుమానంగా ఉంది. ఇద్దరి మధ్య ఏమయినా సంబంధం కుదిరిందేమోనని ఆందోళనగా వుంది. ఇదే ఆలోచనతో ఇటీవల కాస్త మద్యం పుచ్చుకుంటున్నాను. దీనిపై ఆమెతో గొడవపడలేను. ఏం చేయాలో తోచడంలేదు...

 
మీ ఆలోచనలన్నీ అసమర్థమైనవి. అసలు మీకలాంటి నెగటివ్ ఆలోచనే రాకూడదు. భార్యాభర్తల సంబంధం అనేది నమ్మకం మీద నడుస్తుంది. ఏమాత్రం చిన్న అనుమానం వచ్చినా అది పెనుభూతం అవుతుంది. మీ ప్రాణ స్నేహితుడి పైన మీకు నమ్మకం లేదు, కట్టుకున్న భార్య మీద నమ్మకం లేదు అని లోలోన కుమిలిపోవడం కంటే... ప్రతిరోజూ మీ భార్యను మీరే బైకుపై ఎక్కించుకుని వెళ్లి తిరిగి ఇంటికి కూడా మీరు తీసుకుని రండి. అప్పుడు ఓ సమస్య వుండదు. నేను వస్తున్నాను అని ఆమెకు చెప్పడం కంటే... మీరే ఆమె ఆఫీసుకు వెళ్లి పికప్ చేసుకుని వచ్చేయండి. అంతేకాని... లోలోన కుమిలిపోతూ ఇంట్లో కూచుంటే సమస్య తీరదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐస్‌క్యూబ్స్‌తో గొంతుపై మర్దన చేసుకుంటే..?