500 కోట్ల భారీ బడ్జెట్. సంవత్సరం పాటు పడిన శ్రమ. తారాగణం మొత్తం అగ్రతారలే. ఒకరు దక్షిణాది సూపర్ స్టార్. మరొకరు బాలీవుడ్ స్టార్. ఇంకొకరు దేశంలో పేరు కలిగిన దర్శకుడు శంకర్. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే 2.O సినిమా విడుదల ఆలస్యమవుతూ రావడంతో అభిమానుల్లో అనుమానం నెలకొంది.
సినిమాను ఈ సంవత్సరం కాకుండా వచ్చే నెలలో రిలీజ్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అయితే మొత్తానికి చిత్రాన్ని విడుదల చేశారు. ఈ నెల 29వ తేదీన విడుదలైన 2.O సినిమా ప్రపంచ వ్యాప్తంగా 11 వేల థియేటర్లలో విడుదలై ప్రపంచ సినీపరిశ్రమ రికార్డ్‌ను బద్దలు కొట్టింది.
ఇప్పటివరకు సినీ పరిశ్రమలో బాహుబలి సినిమా రికార్డ్ ఒక రోజు కలెక్షన్ 130 కోట్లు. ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టి ఒక్కరోజులేనే 145 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది సినిమా. వారంరోజుల పాటు టిక్కెట్లు కూడా ఆన్‌లైన్‌లో లేవు. అన్ని షోలు ఫుల్ అయిపోయాయి. 2.O సినిమాను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆనందంతో ఉన్నారు. ఇప్పటికే సినిమాకు 4 రేటింగ్ ఇవ్వడంతో భారీ కలెక్షన్ల దిశగా సినిమా దూసుకుపోతోంది.