Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్పను షేక్ చేస్తోన్న లీకులు.. మరో లీక్.. అదే కీలకమట

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (18:52 IST)
పాన్ ఇండియా రేంజ్‌లో సుకుమార్ రూపొందిస్తున్న ఈ ‘పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషిస్తోంది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలున్నాయి.
 
పుష్ప’ చిత్రంలోని ‘దాక్కో దాక్కో మేక’ పాటలు సోషల్‌ మీడియాలో ముందే లీక్ కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. చిత్రయూనిట్ చాలా కంగారు పడ్డారు. ఇలాంటి లీక్స్ చేసే వారిపై చర్య తీసుకోవాలంటూ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రొడ్యూసర్స్ సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే అస్సలు ఊరుకోమంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే అది జరిగిన కొద్దిసేపటికే 'పుష్ప' నుంచి మరో లీక్ బయటకు రావడం షాకిచ్చింది.
 
సినిమాలోని ఇంట్రెస్టింగ్ ఫైట్ సీన్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో అల్లు అర్జున్ స్టైలిష్ యాక్షన్‌‌తో ఫైట్ చేస్తూ కనిపించారు. భుజంపై కుర్చీని పట్టుకుని లుంగీ కట్టి మాస్ లుక్‌లో కనిపించారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సినిమా కంటెంట్ ఇలా ముందే బయటకు రావడంపై మైత్రి మూవీ మేకర్స్ తీవ్రవిచారం వ్యక్తం చేయడంతో పాటు.. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments