Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుష్పకు తప్పని లీకుల బెడద : ప్రేక్షకుల్లో థ్రిల్‌ని చంపేస్తున్నారు...

Advertiesment
పుష్పకు తప్పని లీకుల బెడద : ప్రేక్షకుల్లో థ్రిల్‌ని చంపేస్తున్నారు...
, సోమవారం, 16 ఆగస్టు 2021 (12:41 IST)
చిత్ర పరిశ్రమను ఒకపైపు పైరసీ పట్టిపీడిస్తోంది. ఇపుడు లీకుల బెడద ఎక్కువైంది. ఇది కొత్త సినిమాలకు కూడా తప్పడం లేదు. షూటింగ్ పూర్తికాకముందే పలు సీన్లు ముందుగానే సోషల్ మీడియాలో లీకైపోతున్నాయి. ఈ లీకుల గోలలో పెద్ద హీహీరోల సినిమాలే కాదు చిన్న హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. 
 
ఇటీవల మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘సర్కారువారి పాట’ ప్రచార చిత్రంతోపాటు ఆ తర్వాత వచ్చిన ‘పుష్ప’ చిత్రంలోని ‘దాక్కో దాక్కో మేక’ పాటలు సోషల్‌ మీడియాలో ముందే దర్శనమిచ్చాయి. ఇవి రెండు మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నుండి వ‌స్తున్న సినిమాలే కావ‌డం విశేషం.
 
తాజాగా పుష్ప చిత్రం నుండి ఫైట్ సీన్ లీక్ అయిన‌ట్టు చెబుతున్నారు. 20 సెక‌న్ల వీడియో లీక్ కాగా, ఇందులో అల్లు అర్జున్, ర‌ష్మిక క‌నిపిస్తున్నారు. బ‌న్నీ మెట‌ల్ చైర్‌తో గూండాని కొడుతున్నట్టుగా ఉంద‌ట‌. ఈ ఫైట్ సీన్‌కి సంబంధించిన స‌న్నివేశం ఎడిటింగ్ టేబుల్ నుండే వ‌చ్చింద‌ని అంటున్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్‌కి సంబంధించిన సినిమాల‌కి లీకుల బెడ‌ద ఏర్ప‌డ‌డంతో వారు సైబ‌ర్ క్రైమ్‌ని సంప్ర‌దించారు.
 
ఆన్‌లైన్‌లో లీక్ కావడం పట్ల మైతీ మూవీ మేకర్స్ తీవ్రంగా స్పందించిన మైత్రి సంస్థ‌.. మా చిత్రాలకు సంబంధించిన కంటెంట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేశాం” అని తెలిపింది. 
 
ఈ తరహా ధోరణితో తమను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, ప్రేక్షకులకు అందాల్సిన థ్రిల్‌ను చంపేస్తున్నారని వివరించింది. దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతంకాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని మైత్రీ మూవీ మేకర్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుశాంత్ సింగ్ రాజపుత్ నాకు స్పూర్తిః సకల గుణాభిరామ హీరో స‌న్నీ