Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరి నెక్ట్స్ మూవీ ఫిక్స్... హీరో ఇత‌నే..!

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (11:30 IST)
డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మెహ‌బూబా సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌క‌టించ‌లేదు. మ‌ళ్ళీ త‌న‌యుడుతోనే పూరి సినిమా తీయ‌నున్న‌ట్టు గతంలో ప్ర‌క‌టించారు. కానీ.. ఏమ‌నుకున్నారో ఏమో కానీ.. ఆకాష్ సినిమాని త‌న శిష్యుడు అనిల్ కి ఇచ్చారు. పూరి మాత్రం ఈసారి ప‌క్కా హిట్ కొట్టాల‌నే క‌సితో క‌థ రెడీ చేసార‌ట‌. ఇటీవ‌ల పూరి క‌థ చెప్ప‌డం.. అది ఓకే అవ్వ‌డం కూడా జ‌రిగింద‌ట‌. ఇంత‌కీ.. హీరో ఎవ‌రంటారా..? ఎన‌ర్జిటిక్ హీరో రామ్. 
 
అవును.. రామ్‌కి పూరి క‌థ చెప్పార‌ట‌. విన్న వెంట‌నే మ‌రో ఆలోచ‌న లేకుండా ఈ సినిమా చేద్దాం అని చెప్పాడ‌ట రామ్. ప్ర‌స్తుతం పూరి ఈ సినిమాకి డైలాగ్స్ రాయ‌డం కోసం బ్యాంకాక్ వెళ్లార‌ట‌. మ‌రోవైపు ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా స్టార్ట్ చేసార‌ట‌. ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. ఈ సినిమా కోసమే అనుకుంట రామ్ పూర్తిగా త‌న లుక్‌ని మార్చేసాడు. చాలా డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నాడు. హీరోల‌ను స‌రికొత్త‌గా ప్ర‌జెంట్ చేసే పూరి రామ్‌ని ఎలా చూపిస్తాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త: కరెంట్ చార్జీలు తగ్గబోతున్నాయ్

చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లను విడదీయడం అసాధ్యం: పేర్ని నాని (video)

కాకినాడలోని ఆనంద నిలయం సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి కోరమాండల్ ఇంటర్నేషనల్ చేయూత

Navratri Viral Videos: గర్బా ఉత్సవంలో ఆ దుస్తులేంటి? వీడియో వైరల్

Digital Book: డిజిటల్ పుస్తకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్.. వైకాపా మహిళా నేతపైనే ఫిర్యాదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

తర్వాతి కథనం
Show comments