Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటర్ టబ్‌లో పడి శ్రీదేవి ఒక్కరే చనిపోతారా.. ఇంకెవ్వరికీ అలా జరగదా?

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (12:33 IST)
వెండితెర అందాల నటి శ్రీదేవి దుబాయ్ హోటల్‌లో వాటర్ టబ్‌లో పడి చనిపోగా, ఇపుడు ఈ అంశంపై మరోమారు చర్చకు వచ్చింది. పైగా, శ్రీదేవి భర్త ఇద్దరికీ ఏకంగా నోటీసులు కూడా జారీచేశారు. ఇంతకు ఇందులోవున్న మతలబు ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
 
కన్నుగీటి కుర్రకారు హృదయాలను దోచుకున్న నటి ప్రియా వారియర్. ఈ మలయాళ నటి హీరోయిన్‌గా "శ్రీదేవి బంగ్లా" అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వవహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. 
 
ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా ఈ చిత్ర కథ శ్రీదేవి బయోపిక్ అని స్ఫురిస్తుంది. ఎందుకంటే ఈ ట్రైల్ ముగింపులో హీరోయిన్ వాటర్ టబ్‌లో పడి చనిపోతుంది. దీంతో ఇది శ్రీదేవి బయోపిక్ అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు ప్రియాకు, డైరెక్టర్ ప్రశాంత్ మాంబుల్లికి శ్రీదేవి భర్త నోటీసులు పంపటంతో.. ఈ వివాదంపై టాలీవుడ్, బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.
 
ఈ పరిస్థితుల్లో శ్రీదేవి బంగ్లాపై దర్శకుడు ప్రశాంత్, నటి ప్రియా వారియర్ కూడా స్పందించారు. 'చిత్ర టైటిల్‌లో శ్రీదేవి పేరును మార్చడంతో పాటు కొన్ని సన్నివేశాలు మార్పులు చేయాలనే విధంగా శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ మాకు నోటీసులు పంపారు. ఎవరి బయోపిక్‌ అయినా తెరకెక్కించాలంటే అనుమతులు తీసుకోవాలన్న విషయం మాకు తెలుసన్నారు. 
 
కానీ, ఈ చిత్రాన్ని క్రైమ్‌ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిస్తున్నాం. సినిమాలోని సస్పెన్స్‌ గురించి ముందే చెప్పగలమా? ఈ సినిమా గురించి ప్రశ్నిస్తున్నవారందరికీ కథ చెప్పాలంటే కుదరదు. నేను శ్రీదేవికి వీరాభిమానిని. ఆమె బాత్‌టబ్‌లో‌పడి చనిపోయినంత మాత్రాన ఇంకెవ్వరూ అలా చనిపోకూడదని లేదు కదా? అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. 
 
మరోవైపు, ప్రియా ప్రకాష్ వారియర్ స్పందిస్తూ, 'శ్రేదేవి అనేది ఈ సినిమాలో నా పేరు మాత్రమే. దానికే ఇంత రాద్ధాంతం అవసరమా?. ప్రస్తుతం ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం శ్రేదేవి నేపథ్యంలో ఉందా? లేదా? అనేది విడుదలయ్యాక ప్రేక్షకులే చెప్తారు' అని వ్యాఖ్యానించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments