మళ్లీ సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్

కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. ఒక్క కన్నుగీటుతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె కన్నుగీటుపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. ఈ కేసులో ప్రియా ప్రకాష్ వారియర్‌కు ఊరట కూడా లభించింది.

శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (12:38 IST)
కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. ఒక్క కన్నుగీటుతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె కన్నుగీటుపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. ఈ కేసులో ప్రియా ప్రకాష్ వారియర్‌కు ఊరట కూడా లభించింది. ఇలా ఒక్క కన్నుగీటుతో సెన్సేషన్ సృష్టించిన ఈ భామ.. ఇపుడు మరోమారు అలాంటి సన్సేషన్నే క్రియేట్ చేసింది.
 
'ఒరు ఆదార్‌ లవ్‌' సినిమాలోని మాణిక్య మలరాయ సాంగ్‌లో కన్నుకొట్టి, గన్నుతో పేల్చి కుర్ర హృదయాలను కొల్లగొట్టేసిన విషయం తెల్సిందే. ఈ ఒక్క సాంగ్‌తో బాలీవుడ్‌లో చాన్స్‌ కొట్టేసింది కూడా. ఇక ప్రస్తుతం ఒరు అదార్‌ లవ్‌ సినిమాలోని మరో సాంగ్‌ను రిలీజ్‌చేశారు మేకర్స్‌. ఈ సాంగ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇది కూడా మరో కొత్త రికార్డును సెట్‌ చేస్తోంది. 
 
యూట్యూబ్‌లో అతి తక్కువ కాలంలో ఎక్కువ డిస్‌లైక్‌లు సాధించిన సాంగ్‌గా రికార్డును క్రియేట్‌ చేసింది. ఇప్పటికే ఈ పాటను 10 మంది నెటిజన్లు వీక్షించగా, ఏకంగా 2 లక్షలకు పైగా డిస్‌లైక్‌లతో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఈ పాటే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ప్రియకు ఇంతటి వ్యతిరేకతకు గల కారణాలు ఏంటో తెలియడం లేదు. ఏది ఏమైనా మళ్లీ ప్రియా వారియర్‌ వార్తల్లోకెక్కేసింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం స‌మంత బాగా బాధ‌ప‌డింద‌ట‌... అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన నాగ్..!