Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను భాను.. బాక్స్ బద్దలైపోద్ది అంటూ సుడిగాలి సుధీర్‌ని ఒంగోబెట్టి...

విజయవంతంగా ఢీ10 ముగిసిన తర్వాత ఢీ11 రూపంలో మళ్లీ ముందుకు వచ్చింది నిన్నటి ఎపిసోడ్‌తో. లాస్ట్ సీజన్‌తో పోలిస్తే పెద్దగా మార్పులేవీ కనిపించలేదు. యాంకర్‌గా ప్రదీప్ కొనసాగగా తనదైన మార్క్ డైలాగ్‌లతో ఒక సీజన్ సక్సెస్ అయితే హిట్ అంటారు, రెండో సీజన్ హిట్ అయి

Advertiesment
Dhee 11
, గురువారం, 20 సెప్టెంబరు 2018 (18:51 IST)
విజయవంతంగా ఢీ10 ముగిసిన తర్వాత ఢీ11 రూపంలో మళ్లీ ముందుకు వచ్చింది నిన్నటి ఎపిసోడ్‌తో. లాస్ట్ సీజన్‌తో పోలిస్తే పెద్దగా మార్పులేవీ కనిపించలేదు. యాంకర్‌గా ప్రదీప్ కొనసాగగా తనదైన మార్క్ డైలాగ్‌లతో ఒక సీజన్ సక్సెస్ అయితే హిట్ అంటారు, రెండో సీజన్ హిట్ అయితే సూపర్ హిట్ అంటారు, ఏ సీజన్ మొదలుపెట్టినా హిట్ అవుతుంటే దాన్ని ఢీ అంటారు అని షో మొదలుపెట్టేసాడు. ఇక జడ్జిలుగా శేఖర్ మాస్టర్, ప్రియమణులు కొనసాగారు. టీం లీడర్లుగా సుధీర్ అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ భానుశ్రీ వ్యవహరిస్తున్నారు.
 
ప్రోమో చూసిన తర్వాత చాలామంది రష్మి కూడా ఉంటుందని ఆశించారు కానీ వారి ఆశలపై నీళ్లు చల్లేసారు నిర్వాహకులు. ‘నువ్ ఇప్పటివరకు అందమైన అమ్మాయిల్ని చూసుంటావు, అణకువతో ఉన్న అమ్మాయిని చూసుంటావు, భయంతో ఉన్న వాళ్లనుచూసుంటావు, బలుపుతో ఉన్న వాళ్లని చూసుంటావు, ఆడపులి అమ్మాయి రూపంలో వస్తే ఎలా ఉంటాదో చూస్తావా.. చూస్తావా?' అంటూ మొదటి ఎపిసోడ్‌లోనే సుధీర్ మీదమీదకు రావడమే కాకుండా చెంప ఛెళ్లుమనిపించింది. 
 
స్టార్టింగ్‌లో ఇలా అన్నవాళ్లను చాలామందినే చూసామని సుధీర్ చెప్పగా "నీ మీద పడి అరవడానికి రష్మిని కాదు, నిన్ను బ్రతిమిలాడటానికి వర్షిణిని కాదు.. భాను.. బాక్స్ బద్దలైపోద్ది అంటూ సుధీర్‌ని ఒంగోబెట్టి వీరబాదుడు బాదేసింది. ఇక ఈ ఎపిసోడ్‌ను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా చాలా తక్కువ టైమ్‌లోనే 10 లక్షలకు పైగా వీక్షించారు. సుధీర్ అభిమానులు వార్నింగ్‌లు ఇచ్చారు కామెంట్స్‌లో, అంతేకాకుండా చాలామంది ఓవర్ యాక్షన్ చేస్తోంది, ఆ గొంతు వినలేక ఛస్తున్నామంటూ రష్మిని పెట్టాల్సిందిగా కామెంట్స్ పెట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపికా యాక్టింగ్ స్కిల్స్‌ నాకు నచ్చదు.. కామెడీగా అనిపిస్తుంది: రణ్‌బీర్