Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బిగ్ బాస్' షోలో భాను పనైపోయింది.. ఆటలే లేనట్లు అదే ఆటా బిగ్ బాసూ...

బిగ్ బాస్ ఇంటి నుంచి ఐదో వ్యక్తిగా భానుశ్రీ ఎలిమినేట్ అయ్యారు. తన కపట ప్రవర్తనకు మూల్యం చెల్లించుకున్నారు. ఈ వారం జరిగిన మంచివాళ్లు.. చెడ్డవాళ్లు టాస్క్‌లో కౌశల్ వ్యక్తిత్వంపై నిందలు మోపేందుకు ప్రయత్నించినపుడే ఈ ఆదివారం ఆమె ఎలిమినేట్ అవుతారని ప్రేక్ష

Advertiesment
'బిగ్ బాస్' షోలో భాను పనైపోయింది.. ఆటలే లేనట్లు అదే ఆటా బిగ్ బాసూ...
, సోమవారం, 16 జులై 2018 (20:49 IST)
బిగ్ బాస్ ఇంటి నుంచి ఐదో వ్యక్తిగా భానుశ్రీ ఎలిమినేట్ అయ్యారు. తన కపట ప్రవర్తనకు మూల్యం చెల్లించుకున్నారు. ఈ వారం జరిగిన మంచివాళ్లు.. చెడ్డవాళ్లు టాస్క్‌లో కౌశల్ వ్యక్తిత్వంపై నిందలు మోపేందుకు ప్రయత్నించినపుడే ఈ ఆదివారం ఆమె ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు పసిగట్టారు. ఎందుకంటే ఆమె వ్యవహార శైలి ప్రేక్షకులకు ఇబ్బందికరంగా సనిపించింది. 
 
నాని పైకి ఏదో అన్నారుగానీ… గతవారం శ్యామల ఎలిమినేట్ అయినపుడు కలిగినంత భావోద్వేగాలు ఇప్పుడు కనిపించలేదు. సామాన్యుడిగా బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్లిన గణేష్ ఇప్పటిదాకా నాలుగుసార్లు నామినేట్ అయినా ప్రేక్షకులు అతన్ని కాపాడుతూ వస్తున్నారు. ఇక ఈ ఆదివారం సభ్యులతో నాని ఓ గేమ్ ఆడించారు. 
 
ఓ చీటీలో రెండు సినిమాల పేర్లు రాసి వుంటాయి. సభ్యులు తమకు వచ్చిన చీటీలోని సినిమా పేర్లను సైగలతో చెప్పాలి. ఒక పేరు సభ్యులకు, ఇంకో పేరు నానికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇక్కడో తిరకాసు ఉంది. ఐసు గడ్డపై నిలబడి ఇదంతా చేయాలి. సినిమా పేరు అర్థమయ్యేలా చెప్పడం ఆలస్యమయ్యే కొద్దీ… కాళ్ల కింద ఐసు కరిచేస్తుంటుంది. ఈ టాస్క్‌ను సభ్యులంతా విజయవంతంగా చేశారు. అయితే ఇలాంటి ఆటలు ఇప్పటికే ఒకసారి ఆడించారు. ఆటలే లేనట్లు మళ్లీ దాన్నే తీసుకురావడం షో రొటీనిటీకి అద్దం పడుతోంది. సృజనాత్మకత కోసం పెద్దగా కసరత్తు చేస్తున్నట్లు కనిపించడం లేదు.
 
ఇక బిగ్ బాంబు ఏమంటే… ఒకరు కుర్చీ తీసుకెళుతుంటే ఇంకొకరు ఆ కుర్చీలో కూర్చోవాలి. ఇందులో కూర్చునే పనిని అమిత్‌కు, కుర్చీ మోసే పనిని కౌశల్‌కు ఇచ్చి ఫిటింగ్ పెట్టింది భాను. ఇంతకుమించి ఈ ఆదివారం చెప్పకోదగ్గ విశేషాలు లేవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్మీ గౌతమ్‌కు 38 సంవత్సరాలా? అంతకుమించి..? (వీడియో)