Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢీ11 షోలో సుధీర్‌కు జోడీగా అమ్మాయి కాదు ఆడపులి... రష్మీనే కావాలంటూ...

ఈటీవీలో అత్యంత ఎక్కువ రేటింగ్‌లతో సీజన్‌ల‌కొద్దీ దూసుకుపోతున్న షోలలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఢీ. తెలుగు టీవీ చ‌రిత్ర‌లో ఎన్ని ఛానెళ్లు ఎన్ని డ్యాన్స్ షోలు చేసినా ఢీకి సాటి రాలేకపోయాయి. ఒక్కో సీజన్‌లో ఒక్కో థీమ్‌తో, అదరగొట్టే డ్యాన్సులు, అద్దిరి

Advertiesment
Dhee 11 latest news
, సోమవారం, 17 సెప్టెంబరు 2018 (17:47 IST)
ఈటీవీలో అత్యంత ఎక్కువ రేటింగ్‌లతో సీజన్‌ల‌కొద్దీ దూసుకుపోతున్న షోలలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఢీ. తెలుగు టీవీ చ‌రిత్ర‌లో ఎన్ని ఛానెళ్లు ఎన్ని డ్యాన్స్ షోలు చేసినా ఢీకి సాటి రాలేకపోయాయి. ఒక్కో సీజన్‌లో ఒక్కో థీమ్‌తో, అదరగొట్టే డ్యాన్సులు, అద్దిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్‌తో నంబర్ వన్ డ్యాన్స్ షోగా ముందుకు సాగుతోంది. ఎన్ని డ్యాన్స్ ప్రొగ్రామ్స్ వ‌చ్చిన ఈ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే ‘ఢీ’ డ్యాన్స్ ప్రొగ్రామ్‌ను కొట్టింది ఇప్ప‌టివ‌ర‌కు మ‌రోక‌టి రాలేదు అంటే అతిశేయోక్తి కాదు. ఇటీవల ముగిసిన గ‌త సీజన్ ఎంతగా హిట్ అయ్యిందో, ఎంతమంది ప్రేక్షకులను స్వంతం చేసుకుందో తెలిసిందే.
 
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేవలం డ్యాన్స్‌లు మాత్రమే కాకుండా సుధీర్, ప్రదీప్, రష్మి అందించే వినోదం కూడా హైలైట్‌గా నిలిచింది. సుధీర్ అండ్ రష్మీ కోసమే ఈ షో చూసేవాళ్లు కూడా ఉన్నారు. అందుకే గత రెండు సీజన్లలో ఈ జోడీని అలాగే కొనసాగించారు నిర్వాహకులు. ఈ బుధవారం నుండి ఢీ11 పేరుతో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలో జడ్జిలుగా శేఖర్ మాస్టర్, ప్రియమణి కనిపిస్తుండగా మూడో జడ్జి ఉన్నారా, ఒకవేళ ఉంటే ఎవరనేది తెలియాల్సి ఉంది.
 
ఇక ప్రదీప్ యాంకర్‌గా ఉండగా ఒక టీమ్ లీడర్‌గా సుధీర్ కనిపించగా, ఆపోజిట్ టీమ్ లీడర్‌గా తెలుగు బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ భానుశ్రీ ఆడపులి అంటూ ఎంట్రీ ఇచ్చింది. దీనిపై స్పందించిన నెటిజన్లు రేష్మినే కావాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ రేష్మి కూడా ఇందులో ఉందో లేదో తెలియాల్సి ఉండగా, ఒకవేళ రష్మికి బదులుగా భానును తీసుకున్నట్లయితే షోలో ఎంతవరకు హైలైట్ అవుతుందో చూడాలి మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాని 'పూజ' పోస్టర్‌ ట్విట్‌పై.. రష్మిక ట్యాగ్.. అభిమానులు లైక్స్..