Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాని 'పూజ' పోస్టర్‌ ట్విట్‌పై.. రష్మిక ట్యాగ్.. అభిమానులు లైక్స్..

గీత గోవిందం సినిమాతో అందరి మనసు దోచుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం చేస్తున్న తాజా సినిమా దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున, నాని హీరోలుగా, రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్

Advertiesment
నాని 'పూజ' పోస్టర్‌ ట్విట్‌పై.. రష్మిక ట్యాగ్.. అభిమానులు లైక్స్..
, సోమవారం, 17 సెప్టెంబరు 2018 (16:17 IST)
గీత గోవిందం సినిమాతో అందరి మనసు దోచుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం చేస్తున్న తాజా సినిమా దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున, నాని హీరోలుగా, రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు.
 
దీని సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేస్తుంది చిత్ర యూనిట్. కొద్దిసేపటి క్రితం హీరోయిన్ ఆకాంక్షను పరిచయం చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు తాజాగా గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందన్నను కూడా పరిచయం చేసింది. ఈ కొత్త సినిమాలో రష్మిక పేరును పూజ అని పేర్కొంటూ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. 
 
ఈ పోస్టర్‌ను నాని ట్విటర్‌లో పోస్ట్ చేయగా.. రష్మిక కూడా పోస్ట్ చేస్తూ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పుతూ.. డాక్టర్ దేవదాస్ 27వ తేదిన మీ అపాయింట్‌మెంట్ కావాలి. సెప్టెంబర్ 27న మీ అభిమానులకు మంచి ట్రీట్‌మెంటే ఇస్తారని నమ్ముతున్నానని ట్యాగ్ చేసింది రష్మిక. ఈ ట్విట్‌పై అభిమానులు పెద్ద ఎత్తున లైకులు ఇచ్చారు. ప్రస్తుతం రష్మిక పోస్టర్ సోషలో మీడియాలో వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'స‌వ్య‌సాచి' స్పెష‌ల్ సాంగ్‌లో త‌మ‌న్నా చేయనందా? కుదర్లేదా?