ఇప్పుడే వద్దన్న రష్మిక... వెంటనే కావాలన్న కాబోయే భర్త... కటీఫ్ చేసేసింది...

ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కన్న‌డ భామ ర‌ష్మిక‌. ఈ సినిమా త‌ర్వాత తెలుగులో న‌టించిన గీత గోవిందం సినిమా బ్లాక్‌బ‌ష్ట‌ర్ సాధించ‌డంతో ఈ అమ్మ‌డుకి క్రేజ్ బాగా పెరిగింది. ప్ర‌స్తుతం ఈ బెంగుళూరు భామ నాగార్జున - నాని క‌లిసి న‌టించిన దేవ‌దాస్ సిన

మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (10:22 IST)
ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కన్న‌డ భామ ర‌ష్మిక‌. ఈ సినిమా త‌ర్వాత తెలుగులో న‌టించిన గీత గోవిందం సినిమా బ్లాక్‌బ‌ష్ట‌ర్ సాధించ‌డంతో ఈ అమ్మ‌డుకి క్రేజ్ బాగా పెరిగింది. ప్ర‌స్తుతం ఈ బెంగుళూరు భామ నాగార్జున - నాని క‌లిసి న‌టించిన దేవ‌దాస్ సినిమాలో న‌టించింది. ఈ నెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే... ఈ భామ క‌న్న‌డ హీరో ర‌క్షిత్ శెట్టితో ప్రేమ‌లో ప‌డింది.
 
వీరిద్ద‌రు క‌లిసి క‌న్న‌డ‌లో కిరాక్ పార్టీ సినిమాలో న‌టించారు. అప్ప‌టి నుంచి లవ్‌లో ఉన్న ర‌ష్మిక - ర‌క్షిత్‌ల‌కు పెద్ద‌ల నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగింది. అయితే.. ర‌ష్మికకు తెలుగులో మంచి క్రేజ్ రావ‌డంతో రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత పెళ్లి చేసుకుందాం అంటుంటే... ర‌క్షిత్ శెట్టి మాత్రం ఇప్పుడే చేసుకుందాం అంటున్నాడ‌ట‌. అంతే... ఇక ఇద్ద‌రికీ సెట్ అవ‌దు అని చెప్పి ర‌ష్మిక ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుంద‌ట‌. అదీ.. సంగ‌తి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నిర్మాతకు అదిరిపోయే సలహా ఇచ్చిన హీరోయిన్ నిత్యా మీనన్