Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిర్మాతకు అదిరిపోయే సలహా ఇచ్చిన హీరోయిన్ నిత్యా మీనన్

హీరోహీరోయిన్స్ అంటే దర్శకుడు చెప్పినట్టు సీన్‌లో యాక్ట్ చేసి వెళ్లిపోవడమే కాదు.. తమకొచ్చే వినూత్నమైన ఆలోచనలను కూడా దర్శకనిర్మాతలతో పంచుకంటుంటారు. అయితే అందరూ ఇలా చేస్తారని చెప్పలేం. మనకెందుకులే మన పని మనం చేసుకుపోదాం అనుకునేవాళ్లూ ఉంటారు. అయితే.. వాళ

Advertiesment
నిర్మాతకు అదిరిపోయే సలహా ఇచ్చిన హీరోయిన్ నిత్యా మీనన్
, మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (10:02 IST)
హీరోహీరోయిన్స్ అంటే దర్శకుడు చెప్పినట్టు సీన్‌లో యాక్ట్ చేసి వెళ్లిపోవడమే కాదు.. తమకొచ్చే వినూత్నమైన ఆలోచనలను కూడా దర్శకనిర్మాతలతో పంచుకంటుంటారు. అయితే అందరూ ఇలా చేస్తారని చెప్పలేం. మనకెందుకులే మన పని మనం చేసుకుపోదాం అనుకునేవాళ్లూ ఉంటారు. అయితే.. వాళ్ల సలహా నిజంగానే సినిమాకు ప్లస్ అవుతుందటే మాత్రం దర్శకనిర్మాతలు తప్పకుండా స్వీకరిస్తారు. ఇప్పుడు అలాగే ఓ హీరోయిన్ విషయంలో ఆమె సలహాను నిర్మాత స్వీకరించారు. హీరోయిన్ సలహా నచ్చడంతో సినిమా పేరునే మార్చేశారు. 
 
నిర్మాతకు అదిరిపోయే సలహా ఇచ్చిన ఆ హీరోయిన్ మరోవరో కాదు.. తన అద్భుతమైన నటనతో ఆకట్టుకునే నిత్యామీనన్. ఈ నెల 14న ఆమె నటించిన ‘జనతా హోటల్’ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ఆసక్తికర నిర్మాత సురేష్ కొండేటి వెల్లడించారు. ‘‘నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్ జంటగా మళయాలంలో తెరకెక్కిన ‘ఉస్తాద్ హోటల్’ సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఇంటర్‌నేషనల్ ఫిల్మ్‌ఫెస్ట్‌కు కూడా సెలెక్ట్ అయింది. 
 
అంత గొప్ప సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో డబ్బింగ్ హక్కులు కొన్నాను. అయితే ఆ సినిమాకు తెలుగులో ఏం పేరు పెడితే బాగుంటుందో అని ఆలోచించి ‘జతగా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశాం. ఆ టైటిల్‌తోనే తొలుత టీజర్‌ను విడుదల చేశాం. అయితే టైటిల్ విషయంలో నాకు, నిత్యామీనన్‌కు మధ్య డిస్కషన్ జరిగింది. జతగా అనే టైటిల్ కంటే ‘జనతా హోటల్’ అని పెడితే బాగుంటుందని నీత్యామీనన్ సజెస్ట్ చేసింది. నాకు కూడా ఆ టైటిల్ నచ్చడంతో చివరికి దాన్నే ఫిక్స్ చేశాం. ఆ టైటిల్ విన్నవాళ్లు కూడా అదిరిపోయిందని మెచ్చుకున్నారు. 
 
టైటిల్ విషయంలో ఫుల్ క్రెడిట్ అంతా నిత్యామీనన్‌కే.’’ అంటూ సురేష్ కొండేటి కితాబిచ్చారు. ‘‘ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’ తర్వాత నిత్యామీనన్ లీడ్ రోల్ నటిస్తున్న సినిమా కావడంతో ‘జనతా హోటల్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారేజ్‌లో ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన మెసేజ్ ఉన్నట్లే ఈ ‘జనతా హోటల్’ సినిమాలోనూ ఓ మెసేజ్ ఉంది. సినిమా సెకెండాఫ్ మొత్తం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుంది. నా బ్యానర్ ఎస్‌కే పిక్చర్స్ నుంచి వచ్చిన ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీలాంటి సినిమాల కంటే ఎక్కువగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.
 
మా హీరో దుల్కర్ సల్మాన్ ‘మహానటి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాడనే నమ్మకం ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పటికే తన సంగీతంతో యువతను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు కూడా ఆయన బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.’’ అని నిర్మాత సురేష్ కొండేటి చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎక్కడ ఎలాంటి ప్రశ్న అడగాలో తెలియదా? దీపికా పదుకునే ఫైర్