Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిత్య మీనన్ 'ప్రాణ' లుక్... అంతా గుడ్లప్పగించి చూస్తున్నారట... ఏంటి స్పెషాలిటీ?

నిత్య మీనన్ పాత్రలకు ప్రాణం పోసే నటి. అలా మొదలైంది చిత్రంతో తెలుగులో కెరీర్‌ మొదలుపెట్టిన నిత్య యాక్టింగ్‌కు స్కోప్‌ వున్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆమె యాక్టింగ్ కోస

Advertiesment
నిత్య మీనన్ 'ప్రాణ' లుక్... అంతా గుడ్లప్పగించి చూస్తున్నారట... ఏంటి స్పెషాలిటీ?
, శనివారం, 23 జూన్ 2018 (13:30 IST)
నిత్య మీనన్ పాత్రలకు ప్రాణం పోసే నటి. అలా మొదలైంది చిత్రంతో తెలుగులో కెరీర్‌ మొదలుపెట్టిన నిత్య యాక్టింగ్‌కు స్కోప్‌ వున్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆమె యాక్టింగ్ కోసమే సినిమాలు చేసే ఫ్యాన్‌ బేస్‌ను సంపాదించుకుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. స్టార్‌ వేల్యూ, కమర్షియల్‌ ఈక్వేషన్స్ పట్టించుకోకుండా పాత్ర ప్రాధాన్యతను బట్టి సినిమాలు చేస్తూ .. క్యారెక్టర్‌ క్రెడిబిలిటీని పెంచిన హీరోయిన్ నిత్య మీనన్. ఈసారి నిత్యమీనన్‌ ప్రాణం పోసే ఓ క్యారెక్టర్‌కు సంబంధించిన లుక్‌ నెటిజన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
 
నిత్యమీనన్ ఏదైనా సినిమాలో కనిపిస్తుంది అంటే ఆ క్యారెక్టర్లో ఏదో ఒక విలక్షణత వుంటుందని నమ్ముతారు ఆడియెన్స్‌. అంత రెప్యుటేషన్‌ వున్న హీరోయిన్‌. ఈ మధ్య కాలంలో ఆడియెన్స్ నమ్మకానికి అతీతంగా ఒకట్రెండు టాప్‌ స్టార్స్‌ సినిమాలలో ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్స్ చేసి మమ అనిపించేసింది. రీజన్స్ ఏవైనా నిత్య యాక్టింగ్‌ స్కిల్స్‌ ప్రొజెక్ట్ చేయడానికి స్కోప్‌ లేని కారెక్టర్స్ అవి. అయితే మళ్లీ వింటేజ్‌ నిత్యమీనన్ ఎప్పుడు చూస్తామా అన్న ఆడియెన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌కి కొద్దిగా రీచ్ అయిన మూవీ 'అ'. ఇందులో డిఫరెంట్ రోల్‌ ప్లే చేసింది. కానీ ఫుల్‌ లెంగ్త్‌ నిత్య వర్సటైల్‌ స్కిల్‌ను ప్రొజెక్ట్ చేసే క్యారెక్టర్‌ ఎప్పుడొస్తుందా అని ఆశించేవారికి గుడ్ న్యూస్‌ అంటూ ఫస్ట్‌లుక్ రిలీజ్‌ చేసారు మేకర్స్‌.
 
నిత్య మీనన్ ప్రాణం పోస్తున్న సినిమా పేరు ప్రాణ. తెలుగులో కావ్యాస్ డైరీ వంటి డిఫరెంట్ థ్రిల్లర్‌‌ను డైరెక్ట్‌ చేసిన వి. కె ప్రకాశ్ డైరెక్షన్‌లో ఎస్‌ రాజ్‌ ప్రొడక్షన్స్, రియల్‌ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున మూవీ ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఇందులో నిత్యమీనన్ ఫేస్‌ ఎక్స్‌ట్రీమ్‌ క్లోజప్‌ ఇమేజ్ కనిపిస్తుంది. నిత్య ఫేస్‌ చుట్టూ బేబీ డాల్స్‌ డిజైన్ చేసారు. ఎన్నో బొమ్మలకు ప్రాణం పోసే శక్తిగల యువతిగా తీక్షణమైన చూపుతో కనిపించే నిత్యమీనన్‌ ప్రాణ ఫస్ట్‌లుక్‌‌కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికాగో వ్యభిచార దందాలో హీరోయిన్లందరూ ఉన్నారు : తమ్మారెడ్డి భరద్వాజ్ (Video)