Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క కోసం మాటిచ్చిన ప్రభాస్... ఇంతకీ ఏమిటంటే..?

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (19:08 IST)
టాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్‌లలో ఒకరిగా వెలుగొందిన వారిలో అనుష్క శెట్టి ఒకరు. నాగ్ నటించిన 'సూపర్' సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ హీరోయిన్ దాదాపుగా అందరు స్టార్ హీరోలతో నటించి ఒకనొక సమయంలో భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్‌గా రికార్డులకు ఎక్కింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన ‘అరుంధతి' అనే సినిమాతో ఆమె కెరీర్ ఒక్కసారిగా పీక్స్‌కు వెళ్లిపోయింది. ఆ తర్వాత అనుష్క వెనుదిరిగి చూసుకోలేదు.
 
అయితే ‘సైజ్ జీరో' అనే సినిమా కోసం అనుష్క బాగా లావైంది. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా మునుపటి ఫిజిక్ రావడం లేదట. కాబట్టి ఆమె చాలాకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాహుబలి సినిమాలో అనుష్క ఫిజిక్ బాలేదని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
 
ఇప్పటి వరకు ఆమె ప్రభాస్‌తో మూడు సినిమాల్లో కలిసి నటించారు. ఇక ‘బాహుబలి' సిరీస్ కోసం దాదాపు ఐదేళ్లు కలిసి ఉన్న వీరి మధ్య లవ్ ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు ప్రచారం అయ్యాయి. టాలీవుడ్‌లో అత్యంత ప్రాధాన్యత స్వంతం చేసుకున్న వార్తలలో ఇది ఒకటి.
 
ప్రస్తుతం అనుష్క ‘నిశ్శబ్దం' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సినిమా కోసం త్వరలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడట. ఈ మేరకు ఫంక్షన్ ఎక్కడున్నా సరే తాను ముఖ్య అతిథిగా తప్పనిసరిగా హాజరవుతానని చిత్ర యూనిట్‌కు హామీ కూడా ఇచ్చారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments