Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండగే..!

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (22:37 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో సినిమాని ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ సంవత్సరం చివరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
 
ఇదిలా ఉంటే... సాహో సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోకపోవడంతో ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్ లోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌తో ప్రభాస్ ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. పిరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది.
 
ఈ భారీ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో.. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ యు.వి.క్రియేషన్స్ నిర్మాతల్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు. దీంతో ఫ్యాన్స్ ట్రోల్ చేయడం చూసి ఇక లాభం లేదనుకుని ఈ సినిమా నిర్మాతలు ట్విట్టర్లో స్పందిస్తూ... ప్రభాస్ మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్ట్స్‌తో క్యూట్ ఛేజ్ సీన్ పూర్తయ్యిందని.. త్వరలో మరో భారీ యూరప్ షెడ్యూల్ ఉందని తెలియచేసింది. 
 
ఈ క్రేజీ మూవీలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్ జాన్ అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత 96 తెలుగు రీమేక్‌కి జాను అని టైటిల్ పెట్టడంతో ప్రభాస్ మూవీకి వేరే టైటిల్ పెట్టనున్నారు. ఈ సినిమా కోసం యు.వి.క్రియేషన్స్ ఓ డియర్, రాధే శ్యామ్ అనే రెండు టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారు. ఈ రెండు టైటిల్స్‌లో ఒక టైటిల్‌ను త్వరలో ఖరారు చేయనున్నట్టు సమాచారం. టైటిల్‌ను ఖరారు చేసి, టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్‌ను ఉగాది రోజున రిలీజ్ చేయనున్నట్టు తెలిసింది. 
 
సో.. ఈ ఉగాది రోజున ప్రభాస్ అభిమానులకు మంచి గిఫ్ట్‌నే ఇవ్వనున్నారు. ప్రభాస్, పూజా హేగ్డేలపై చిత్రీకరించిన లవ్ సీన్స్ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయని డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెలియచేసారు. అలాగే కృష్ణంరాజు, ప్రభాస్ లపై చిత్రీకరించనున్న సీన్స్ చాలా బాగుంటాయని.. ఫ్యాన్స్ కు అయితే... పండగే అన్నట్టుగా ఉంటుందని చిత్ర యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. నవంబర్ నుంచి ప్రభాస్ నాగ్ అశ్విన్ తో చేయనున్న మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉపాధ్యాయుడికి చెప్పు దెబ్బలతో దేహశుద్ధి... (Video)

సముద్రపు తాబేలు కూర తిని ముగ్గురి మృతి, 30 మందికి పైగా అస్వస్థత

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.. పడ్డాడో అంతే సంగతులు? (వీడియో)

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. స్టెల్లా షిప్‌ను సీజ్‌ చేసిన అధికారులు

ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్‌పై తప్పుడు నివేదిక : డాక్టర్ ప్రభావతి అరెస్టు తప్పదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments