Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ ఇచ్చే ప్రయత్నం - ముద్దు పెట్టేందుకు ప్రయత్నించిన అభిమాని... పూనమ్ షాక్...

ఠాగూర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (11:02 IST)
వివాదాస్పద బాలీవుడ్ నటి, మోడల్ పూనం పాండేకు చేదు అనుభావం ఎదురైంది. ఓ ఫోటో సెషన్‌లో భాగంగా విలేకరులతో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. 
 
దీన్ని గమనించిన నటి అతడికి సెల్ఫీ ఇచ్చే ప్రయత్నం చేయగా, బలవంతంగా ఆమెను ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేసాడు. దీంతో నటి సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే తేరుకున్న పూనం అతడిని బలంగా నెట్టవేసింది. అలాగే, ఫోటో జర్నలిస్టు ఒకరు వెంటనే అప్రమత్తమైన అతడి నుంచి ఆమెను రక్షించారు. 
 
వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే జరిగిందని, స్క్రిప్టెడ్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీడియోను గమనిస్తే మొదటి నుంచీ ఆమె తీరు అనుమానాస్పదంగా ఉందని ఒకరంటే, ఆమె అంత బాగా నటించలేదని మరొకరు రాసుకొచ్చారు. 
 
కాగా, గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన పెంచడంలో భాగంగా, గతేడాది తాను చనిపోయినట్టు పూనం అందరినీ నమ్మించింది. అయితే, ఆ తర్వాత తాను బతికే ఉన్నానని, కేన్సర్‌పై అవగాహన కల్పించడం కోసమే అలా నటించానని వివరణ ఇచ్చుకుంది. కాగా, వివాదాస్పద కామెంట్స్, సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలతో పూనం నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. అలాగే, సినీ నిర్మాత శామ్ బాంబేతో వివాహం, విడాకుల విషయంలోనూ ఆమె వార్తల్లోకి ఎక్కింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బిర్యానీ డబ్బులు అడిగారనీ హోటల్‌ సిబ్బంది తలపగులగొట్టారు (Video)

స్కూలుకు వెళుతూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన చిన్నారి!!

కుమార్తె కాళ్లు కడిగి కన్యాదానం చేసిన తండ్రి.. ఆ కొద్దిసేపటికే...

భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్కుడు : హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టేశారు...

ఒంటరిగా ఉన్న మహిళతో మాటలు కలిపారు.. హోటల్‌కు తీసుకెళ్లిన అత్యాచారం చేశారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments