Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ‌కాంత్ అడ్డాల క్లాప్ తో ఆరంభ‌మైన పొలిటిక‌ల్ డ్రామా చిత్రం

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (16:49 IST)
Srikanth Addala, Sri Vishnu, VN Aditya and others
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల క్లాప్ తో నూత‌న చిత్రం ఆరంభ‌మైంది. పొలిటిక‌ల్ డ్రామా గా రూపొంద‌నున్న ఈ సినిమాలో ధ‌ర్మ‌, పవి హీరో హీరోయిన్లుగా న‌టించ‌నున్నారు. శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై రూపొందుతోంది. డిస్ట్రిబ్యూష‌న్ రంగంలో అనుభ‌వం ఉన్న నిర్మాత ప్ర‌వీణ్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. 
 
పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో ఆలోచింప‌జేసే క‌థ‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంతో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ చిత్రాల‌కు సినిమాటొగ్రాఫ‌ర్‌గా ప‌నిచేసిన శ్యామ్ తుమ్మ‌ల‌పల్లి ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం కాబోతున్నారు. ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. మొద‌టి స‌న్నివేశానికి ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల క్లాప్ కొట్ట‌గా మాగంటి గోపీనాథ్ కెమెరా స్విచాన్ చేశారు. 
 
హీరో శ్రీ విష్ణు, ద‌ర్శ‌కుడు వీఎన్ ఆదిత్య స్క్రిప్టును మేక‌ర్స్‌కు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి  నిర్మాత వివేక్ కూచిబొట్ల హాజ‌రయ్యారు. డిసెంబ‌రు చివరి వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది. 
 
సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం: శ్యామ్ తుమ్మ‌ల‌పల్లి,  నిర్మాత‌: జె. ప్ర‌వీణ్ రెడ్డి, సంగీతం: గౌర హ‌రి, సినిమాటోగ్రఫీ: కేశవ,  క‌థ‌: కిషోర్ శ్రీ కృష్ణ‌,  ఎడిట‌ర్‌: జెస్విన్ ప్ర‌భు, కో-ప్రొడ్యూస‌ర్‌: చైత‌న్య కందుల‌, సుబ్బారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: రామ‌బాలాజి. డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments