Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీ విష్ణు - అర్జున ఫల్గుణ నుంచి గోదారి వాల్లే సందమామ పాట విడుదల

శ్రీ విష్ణు  - అర్జున ఫల్గుణ నుంచి  గోదారి వాల్లే సందమామ పాట విడుదల
, శనివారం, 13 నవంబరు 2021 (18:54 IST)
Sri Vishnu, Amrita Iyer
శ్రీ‌విష్ణు హీరోగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి అర్జున ఫల్గుణ అనే చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. తాజాగా మొదటి పాటను విడుదల చేశారు. గోదారి వాళ్లే సందమామ అంటూ విడుదల చేసిన లిరికల్ వీడియోతో మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. గోదావరి జిల్లాల్లో ప్రజల మనస్తత్వాలు, అక్కడి పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఈ పాట సాగుతుంది. చైతన్య ప్రసాద్ చక్కటి సాహిత్యాన్ని అందించారు. ఈ పాటలో శ్రీ విష్ణు అమృత అయ్యర్ మధ్య  కెమిస్ట్రీ చాలా బాగుంది. అమల చేబోలు, అరవింద్ ఈ పాటను ఆలపించారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ మంచి బాణీని అందించారు.
 
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. పి. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.
 
ఈ మధ్యే విడుదలైన అర్జున ఫల్గుణ టీజర్‌కు విశేష స్పందన లభించింది. దీంతో సినిమా మీద అంచనాలు భారిగా పెరిగాయి.
 
నటీనటులు : శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అవుట్.. కారణం ఏంటి?