Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీ విష్ణు అర్జును ఫల్గుణ నుంచి -కాపాడేవా? రాపాడేవా విడుదల

శ్రీ విష్ణు అర్జును ఫల్గుణ  నుంచి -కాపాడేవా? రాపాడేవా   విడుదల
, బుధవారం, 17 నవంబరు 2021 (16:46 IST)
Sri Vishnu, Amrita Iyer and others
శ్రీ విష్ణు తాజాగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై  `అర్జున ఫల్గుణ` అనే చిత్రంలో న‌టించారు. అది విడుదలకు సిద్దంగా ఉంది. అర్జున ఫల్గుణ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాట అందరినీ ఆకట్టుకుంది. నేడు కాపాడేవా రాపాడేవా? అనే మరో పాటను విడుదల చేశారు. ఈ పాట ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా ఉంది. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ అద్భుతమైన బాణీని ఇచ్చారు.
 
ఈ పాటలో శ్రీ విష్ణు అతని స్నేహితులు, అమృతా అయ్యర్ అందరూ కనిపిస్తున్నారు. చైతన్య ప్రసాద్ రాసిన సాహిత్యం ఎంతో పవర్ ఫుల్‌గా ఉన్నాయి. మోహన భోగరాజు గాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.
 
టీజర్, ఫస్ట్ సింగిల్‌కు విశేషమైన స్పందన రాగా.. ఈ రెండో పాట కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. పి. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.
 
నటీనటులు : శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటీటీ ఆఫర్స్ వచ్చినా, థియేటర్ కోసమే చూశాం - హర్ష నర్రా