Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిఖిల్ హీరోగా యాక్షన్ స్పై సినిమా ప్రారంభం

నిఖిల్ హీరోగా యాక్షన్ స్పై సినిమా ప్రారంభం
, శుక్రవారం, 8 అక్టోబరు 2021 (17:47 IST)
Nikil new movie opening
హీరో నిఖిల్ కెరీర్‌లో 19వ చిత్రాన్ని గ్యారీ బీహెచ్ (గూఢచారి, ఎవరు, హిట్ సినిమాలకు ఎడిటర్) దర్శకత్వంలో రాబోతోంది. రెడ్ సినిమాస్ ప‌తాకంపై కే రాజశేఖర్ రెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
చరణ్ తేజ్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  శుక్ర‌వారంనాడు ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.
 
ప్ర‌ముఖ నిర్మాతలు శరత్ మరార్, జెమినీ కిరణ్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కు అందించారు. సినిమా సక్సెస్ అవ్వాలని చిత్రయూనిట్‌కు విషెస్ అందజేశారు.
 
ముహుర్తం షాట్‌కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించగా నిర్మాత రాజశేఖర్ రెడ్డి క్లాప్ కొట్టారు. నిర్మాత కూతురు, కొడుకు ఈశన్వి, ధృవ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
 
నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఖ‌రారు చేయ‌లేదు. విభిన్న పాత్రల్లో నటిస్తూ వస్తోన్న నిఖిల్ మొదటిసారిగా గూఢాచారి (స్పై) పాత్రలో నటిస్తున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నారు.
 
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు నైపుణ్యంగ‌ల‌ సాంకేతిక బృందం పని చేస్తోంది. డైరెక్టర్ గ్యారీ బీహెచ్ స్వతాహాగా ఎడిటర్‌ కావడంతో ఈ సినిమాకు కూడా ఎడిటింగ్ బాధ్యతలను తీసుకున్నారు. మనోజ్ రెడ్డి కెమెరామెన్‌గా, శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.
 
అనిరుధ్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి రచయిత. అర్జున్ సురిశెట్టి ఆర్ట్ డైరెక్టర్‌గా, రవి ఆంటోని ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
దర్శకుడు, ఎడిటర్ : గ్యారీ బీహెచ్,  నిర్మాత : కే రాజశేఖర్ రెడ్డి,  స‌హ‌- నిర్మాత‌ : చరణ్ తేజ్, రచయిత : అనిరుధ్ కృష్ణమూర్తి,  సంగీతం : శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భగవంతుడిగా సునీల్ -హెడ్స్ అండ్ టేల్స్ ఫ‌స్ట్‌లుక్ ఆవిష్క‌రించిన రెజీనా