Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి నుంచి పెప్పీ నెంబర్ కఫీఫీ విడుదల

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (16:44 IST)
Nagawourya, malivika
కార్తికేయ-2, ధమాకా వంటి వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' చిత్రాన్ని నిర్మించింది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. నాలుగు పాటలు, నేపథ్య సంగీతం కళ్యాణి మాలిక్ అందించగా.. ఒక పాట వివేక్ సాగర్ స్వరపరచడం విశేషం. కళ్యాణి మాలిక్ స్వరపరిచిన పాటల్లో ఇప్పటికే మూడు పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి.  ముఖ్యంగా 'కనుల చాటు మేఘమా' పాటకు అద్భుతమైన స్పందన లభించింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి వివేక్ సాగర్ సంగీతం సమకూర్చిన 'కఫీఫీ' పాట విడుదలైంది.
 
'కఫీఫీ' లిరికల్ వీడియోను బుధవారం ఉదయం విడుదల చేశారు మేకర్స్. 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నుండి ఇప్పటిదాకా విడుదలైన పాటలు హాయిగా, ఆహ్లాదకరంగా సాగే మెలోడీలు అయితే.. ఈ పెప్పీ నెంబర్ మాత్రం అందరిలో ఉత్సాహాన్ని నింపేలా ఉంది. 'కఫీఫీ' అంటూ అందరూ కాలు కదిపేలా అద్బుతమైన బాణీ సమకూర్చారు వివేక్. "నలుగురిలో ఉంటే.. చిలిపిగ పోతుంటే.. చనువుకి నో నో చెప్పేదే కఫీఫీ" అంటూ పాట సాగింది. పాట సందర్భానికి, బాణీకి తగ్గట్లుగా కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం అందంగా, అర్థవంతంగా ఉంది. "ఇది అది కాదంటూ.. వివరము వేరంటూ.. పరిమితిలోనే ఉంచేదే కఫీఫీ", " పరిధులు లేని వింత సహవాసం పరిగెడుతుంటే తగదుగా" అంటూ మళ్లీ మళ్లీ పాడుకునేలా క్యాచీ లిరిక్స్ తో లోతైన భావాన్ని పలికించారు. గాయకులు బెన్ హ్యూమన్, విష్ణుప్రియ తమ మధుర గాత్రంతో పాటను ఎంతో ఉత్సాహంగా ఆలపించారు.
 
'కఫీఫీ' సాంగ్ ఎంత ఎనర్జిటిక్ గా సాగిందో.. లిరికల్ వీడియోలో నాయకానాయికలు నాగశౌర్య, మాళవిక అంతకంటే ఎనర్జిటిక్ గా కనిపించారు. పబ్ లో జరుగుతున్న పార్టీలో స్నేహితులతో కలిసి నాయకానాయికలు ఉత్సాహంగా చిందేయడం అలరిస్తోంది. ముఖం మీద చిరునవ్వుతో ఇద్దరూ ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడి డ్యాన్స్ చేస్తున్నారు. పాటలోని ఉత్సాహాన్ని, నాయకానాయికలు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ యశ్ మాస్టర్ సమకూర్చిన నృత్య రీతులు ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఈ పాటకి థియేటర్లలో అద్భుతమైన స్పందన లభించడం ఖాయమనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments