తన గత చిత్రం 'ఒకే ఒక జీవితం'తో అందరికీ ఎమోషనల్ ట్రీట్ ఇచ్చిన ప్రామిసింగ్ హీరో శర్వానంద్ పంథా మార్చారు. ముందుగా, అదనపు కేలరీలను కోల్పోవడానికి, షార్ఫ్ ఫిజిక్ ని బిల్డ్ చేసుకోవడానికి కొంత విరామం తీసుకున్నారు. రెగ్యులర్ స్టఫ్ చేయకూడదని కూడా నిర్ణయించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేసిన శర్వానంద్ 35 వ చిత్రం ఒక యూనిక్ పాయింట్ తో ఫ్యూచరిస్టిక్ ఎంటర్‌టైనర్ గా ఉండబోతోంది.
టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శ్రీరామ్ ఆదిత్య స్టైలిష్ బెస్ట్ లుక్ లో శర్వానంద్‌ను ప్రెజెంట్ చేయనున్నారు. న్యూస్ పేపర్ యాడ్ లా రూపొందించబడిన పోస్టర్‌లో శర్వా ఫంకీ, స్లీక్, ఎలిగెంట్ గా కనిపిస్తున్నారు. ఇది చాలా ఇంటరెస్టింగ్ కాంబినేషన్. టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన నిర్మాతలలో ఒకరైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్ #శర్వా35ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ బ్యానర్ లో చివరిగా విడుదలైన ధమాకా సంచలన విజయం సాధించింది.
#Sharwa35 కి వస్తే, చిత్రీకరణ కొనసాగుతోంది. పోస్టర్ లో చూపిన కోఆర్డినేట్‌లు- 51.5055° N, 0.0754 ° W UK లోని లండన్ ను లొకేషన్ గా సూచిస్తున్నాయి. సినిమాలో శర్వానంద్ క్యారెక్టర్ ఎంత క్రేజీగా ఉండబోతుందో పోస్టర్ స్పష్టం చేస్తోంది. ఈ పాత్రకు మేకోవర్ జస్ట్ వావ్ అనిపిస్తోంది.
క్రేజీ కాంబినేషన్ లో రూపొందే ఈ చిత్రానికి అత్యంత ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. మలయాళ కంపోజర్ హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. డీవోపీ విష్ణు శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్ కాగా, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్. ఇతర వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.