Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారి ఆద‌ర‌ణ కాలిబాధ‌ను మ‌ర్చిపోయేలా చేసిందిః ప్ర‌దీప్ మాచిరాజు

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (18:05 IST)
Pradeep Machiraju, Yankar cum Hero
``న‌టుడిగా పాత్ర‌ప‌రంగా ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్లు అన్నీ సినిమాకు చేశాం. యాక్ష‌న్ సీన్స్ కూడా చేశాను. ఎప్పుడు చేయ‌ని రిస్క్‌లు చేశాను. షూటింగ్ క్ల‌యిమాక్స్‌లో రోప్‌పై వెళ్ళే యాక్ష‌న్ సీన్ చేసేట‌ప్పుడు కింద‌ప‌డ్డాను. కాలికి గాయ‌మైంది. అప్పుడు నొప్పిగా వున్నా.. ఇప్పుడు మొత్తం మ‌టుమాయ‌మైంది. అందుకు కార‌ణం ప్రేక్ష‌కులు మా సినిమాలోని పాట‌కు చూపించిన ఆద‌ర‌ణ‌తోపాటు రేపు సినిమాను త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కంతో చెబుతున్నాన‌ని`` యాంక‌ర్ క‌మ్ హీరో ప్ర‌దీప్ మాచిరాజు వెల్ల‌డించారు.  “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి వెండితెరపై తన అదృష్టం పరీక్షించడానికి ఈ శుక్ర‌వార‌మే రెడీ అవుతున్నాడు. ఈ సందర్భంగా వెబ్‌దునియాతో జ‌రిపిన‌ ఇంటర్వ్యూ విశేషాలు.
 
హీరో అంటే డాన్స్‌లే కాదు, ఫైట్స్‌కూడా చేయాలి. రిస్క్ అనిపించ‌లేదా?
నిజ‌మే. హీరో ఆల్‌రౌండ‌ర్‌గా అన్నీ చేయాలి. యాంక‌ర్‌గా నేను బుల్లితెర‌పై కొన్నిటికే ప‌రిమితం. వెండితెర‌పై వ‌చ్చాక ఆ విజ‌న్ బాగా చూపించాలి. అందుకే క‌థాప‌రంగా యాక్ష‌న్ స‌న్స్ చేసేట‌ప్పుడు రోప్ మీద‌నుంచి దూకాలి. అలా చేసేట‌ప్పుడు కింది ప‌డిపోయాను. కాలికి గాయ‌మైంది. ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం. నిర్మాత‌, ద‌ర్శ‌కులు కూడా బాగా చూసుకున్నారు. కేర‌ళ‌లో ఎత్తైన వాట‌ర్‌ఫాల్స్ అంద‌మైన లొకేష‌న్‌లో తీశారు. అద్భుతంగా వ‌చ్చి. అయినా ఆ బాధ అంతా మ‌ర్చిపోయేలా చేసింది ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌.
సినిమాపై న‌మ్మ‌కం ఎలా క‌లిగింది?
ముఖ్యంగా కొద్దిమందికి ఈ సినిమాను చూపించాం. వ‌య‌స్సుల‌వారీగా యూత్‌కూ, పెద్ద‌ల‌కు, బామ్మ‌ల‌కు, మ‌హిళ‌ల‌కు అంద‌రినీ సెల‌క్ట్ చేసి చూపించాం. మేం వ‌స్తున్న‌ట్లు వారికి చెప్ప‌లేదు. సినిమా పూర్త‌య్యాక వారు విశ్లేషించిన తీరు, వారు స్పందించిన విధానం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. క్ల‌యిమాక్స్‌లో కంట త‌డిపెట్టించావ్ రా అబ్బాయ్‌! అంటూ త‌న ఇంటి మ‌నిషిలా ఓ బామ్మ అంటుంటే.. క‌ష్టాల‌న్నీ మ‌టు మాయం అయిన‌ట్ల‌యింది. ఇక మ‌హిళ‌లు అయితే త‌మ ఇంటివాడిగా మాట్లాడుంటే పూర్తి న‌మ్మ‌కం వ‌చ్చేసింది.
అసలు ఈ కథ, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది.?
ద‌ర్శ‌కుడు మున్నా ఈ కథను నాకు చెప్పినపుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నేను ఎలా అయితే ఎదురు చూస్తున్నానో టెలివిజన్ ప్రదీప్ కు 70 ఎంఎం స్క్రీన్ పై ప్రదీప్ కు ఎలాంటి డిఫరెన్స్ ఉండాలో యాంకర్ ప్రదీప్ ఛాయలు ఎక్కడా లేకుండా ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా మున్నా రాసుకున్న రెండు క్యారెక్టర్స్ చాలా బాగా అనిపించాయి. అలాగే వేరియేషన్స్, గెటప్స్ ఉన్నాయి. చందమామ కథలు లాంటి ఫాంటసీ తో ఇంటర్వెల్ నుంచి ఇంకో ఎమోషన్ లో ఉంటుంది. సో ఇంతకంటే ఇంకేం కావాలి అనుకున్నా.
 
Pradeep Machiraju, Yankar cum Hero
మీరు ముందు యాక్టర్ అవ్వాలి అనుకున్నారా?యాంకర్ అవ్వాలి అనుకున్నారా?
సగటు మిడిల్ క్లాస్ అబ్బాయిల్లానే యాక్టర్ అవ్వాలని కోరిక నాకు కూడా పుట్టింది. సినిమాలు బాగా చూసేవాడిని ఏదన్నా అవార్డ్ ఫంక్షన్ అయితే అందులో వాళ్ళు చెప్పే మాటల్ని బాత్రూం లో ప్రాక్టీస్ చెయ్యడం ఇంట్లో ఏదొకలా డబ్బులు అడిగి ఎక్కువగా సినిమాలు చూసి యాక్టింగ్ అంటే ఇలా ఉంటుందా అని నేర్చుకున్నా కానీ అలా ఎదిగాక నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఓ రేడియో ఛానెల్లో పని చెయ్యడం అక్కడ నుంచి సినిమా ఆఫర్స్ వచ్చాయి.
అబ్బాయ్ గారు రోల్ కి స్పెషల్ వర్క్ ఏమన్నా చేసారా?
దానికి స్పెషల్ వర్క్ అని ఏమి లేదు, రాజమండ్రి ఊర్లో పోలవరం వెనకాల షూట్ చేసాం, అమ్మ నాన్న పుట్టింది అక్కడే అమలాపురం కాబట్టి ఇంట్లో ఆ భాష వచ్చేస్తుంది సో అక్కడ చాలా ఈజీ అయ్యింది. అంతే కానీ పెద్దగా స్పెషల్ వర్క్ ఏమీ అవసరం పడలేదు.
ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ కాదని డైరెక్టర్ అంటున్నారు, అస్సలు కాన్సెప్ట్ ఏంటి?
రెగ్యులర్ లవ్ స్టోరీ అంటే..లవ్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కానీ దాని ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. అలాగే ఈ కథలో వచ్చే ట్విస్టులు ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా అనిపిస్తాయి. అలాగే కొర్ పాయింట్ కొత్తగా ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి అంతా మారుతుంది.
సినిమా లేట్ అవ్వడంపై ఆ టైం ఎలా తీసుకున్నారు?
ఆ టైం లో నేను చాలా డౌన్ అయ్యిపోయాను, థియేటర్స్ దొరికాయి సినిమా మార్కెట్ లోకి బాగా వెళ్ళింది ఇంకా సినిమా రిలీజ్ కావడానికి మూడు రోజులు ఉన్నాయి అనగా లాక్ డౌన్ పెట్టడంతో చాలా డిజప్పాయింట్ అయ్యాను. తర్వాత ఓటిటి రిలీజ్ అంటే మరో టెన్షన్ మొదలయ్యింది. అక్కడ మేము మళ్ళీ స్టక్ అయ్యాం కానీ మా ప్రొడ్యూసర్ సిల్వర్ స్క్రీన్ పైనే నా మొదటి సినిమా రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు అలా ఇప్పుడు మేము ఇక్కడున్నాం.
అనూప్ ఎంపిక మీదేనా?
 అనూప్ బాగా తెలుసు. షోలో క‌లిసివేవాళ్ళం. క‌థ చెప్పిన‌ప్పుడు పాట సిట్య‌వేష‌న్ ఆయ‌న‌కు చెబితే ఎలాంటి ట్యూన్ క‌డ‌తాడ‌నే ఇంట్రెస్ట్ వుంది. అందుకు త‌గిన‌ట్లే అద్శుత‌మైన ట్యూన్ ఇచ్చాడు. అనూప్ రూబెన్స్ గారు తన జాబ్ తో ట్రెమండ్యస్ జాబ్ అందించారు. ఆడియెన్స్ కు మా సినిమా రీచ్ అయ్యిన విధానం చాలా సంపాదించుకుంది. అలాగే అదే సినిమాకు ఒక లైఫ్ ఇచ్చింది. నీలినీలి.. పాట‌ను అద్భుతంగా మార్చారు చంద్ర‌బోస్‌గారు. అదేవిధంగా అమ్మ‌పాట‌ను అనంత శ్రీ‌రామ్ మ‌రింత బాగా రాశారు.
హీరోయిన్ అమృత ఎలా న‌టించింది?
అమృత అయ్య‌ర్ కు న‌ట‌న‌లో అనుభ‌వం ఉంది. త‌మిళ్‌లో న‌టించారు. ఇందులో మా ఇద్ద‌రిదీ టామ్ అండ్ జెర్రీ క‌థ. ఫ‌స్ట్ ఆఫ్ త‌న‌తో మొద‌ల‌యి చివ‌రి వ‌ర‌కు మంచి రోల్ రావ‌డం ఆమె అదృష్టం. ద‌ర్శ‌కుడు మున్నా రాసిన లైన్లోనే ఆమె న‌టించింది.
టెలివిజ‌న్ నుంచి సినిమాకు వ‌చ్చారు. పారితోషికం ఎంత తీసుకున్నారు?
అది చెప్పొచ్చో లేదో తెలీదు. కానీ ఒక‌టి చెప్ప‌గ‌ల‌ను.  టెలివిజ‌న్ ఉద్యోగంలా రోజూ జ‌రుగుతుంది. ఛాన‌ల్‌తో టై అప్ అయి వుంటుంది. సినిమా కు వ‌చ్చేస‌రికి `ఐ ఫెల్ట్ సినిమా స‌క్సెస్ అయ్య‌కా నిర్మాత‌కు డ‌బ్బులు వ‌చ్చాక తీసుకుంటాన‌ని` చెప్పాను.. అంటూ ఛ‌లోక్తితో ముగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments