Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త‌మ్ముడు సినిమా ప‌దిసార్లు చూశా, నా కల తీరడానికి పదేళ్లు పట్టింది: ప్రదీప్ మాచిరాజు

త‌మ్ముడు సినిమా ప‌దిసార్లు చూశా, నా కల తీరడానికి పదేళ్లు పట్టింది: ప్రదీప్ మాచిరాజు
, శనివారం, 23 జనవరి 2021 (19:13 IST)
బుల్లితెరపై నంబరాఫ్ షోస్‌తో అశేష ప్రేక్షకాభిమానులను అలరించిన ప్రదీప్ తొలిసారి హీరోగా పరిచయం అవుతూ నటిస్తున్న చిత్రం "30 రోజుల్లో ప్రేమించడం ఎలా". యస్ వి ప్రొడక్షన్స్ పతాకంపై ఫణి ప్రదీప్ దర్శకత్వంలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా యస్ వి బాబు నిర్మించిన ఈ చిత్రం జనవరి 29న వరల్డ్ వైడ్‌గా విడుదల అవుతోంది. మెలోడీ మాస్టర్ అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియోకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులోని నీలి నీలి ఆకాశం సాంగ్ 300 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టుకొని సెన్షేషనల్ హిట్ అయింది. అంతలా ఈ చిత్రానికి క్రేజ్ వచ్చింది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
 
హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ.. 'ఇప్పటివరకు డిఫరెంట్ టెలి షోస్ చేశాను. అదొక మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. యాంకర్‌గా ప్రజలందరూ ఆదరించారు. యాక్టర్ అవ్వాలనేది నా కల. అది తీరడానికి పదేళ్లు పట్టింది. ప్రేక్ష‌కుడిగా హైద‌రాబాద్ సంధ్య థియేట‌ర్ల‌లో త‌మ్ముడు సినిమాను ప‌దిసార్లు చూశాను. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల్లో హీరోలు ఎలా చేస్తారో.. వారిని అనుక‌రించి చేసేవాడిని.. నేను హీరోగా మారడానికి ప‌దేళ్ళు ప‌ట్టింది.
 
ఇక ఈ సినిమా క‌థ‌ను మున్నా ఫస్ట్ చెప్పగానే బాగా నచ్చింది. యస్వీ బాబు గారు గ్రేట్ హంబుల్ పర్సన్. సినిమాకి అన్నీ ప్రొవైడ్ చేసి అన్‌కాంప్రమైజ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. జాబ్ శాటిస్పాక్షన్‌తో పాటు జేబు శాటిస్పాక్షన్ కలగాలి. అనూప్ మ్యూజిక్, చంద్రబోస్ గారి లిరిక్స్, శివేంద్ర విజువల్స్ సినిమాకి బిగ్ ఎస్సెట్ అవుతాయి. మున్నా కథ విని చాలా ఎక్సయిట్ అయ్యాను. నా క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ బాగా డిజైన్ చేశాడు. సినిమా చూసి ఒక చిరునవ్వుతో బయటికి వస్తారని ప్రామిస్ చేస్తున్నా. ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. అన్నీ ఎమోషనల్ సీన్స్‌కి కనెక్ట్ అవుతారు. అమృత అయ్యర్ సూపర్బ్‌గా పెర్ఫార్మెన్స్ చేసింది. అమ్మ క్యారెక్టర్లో హేమ చాలా బాగా చేసింది. హర్ష, భద్రం ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.. అన్నారు.
 
చిత్ర నిర్మాత యస్.వి. బాబు మాట్లాడుతూ.. 'ఇటీవల రిలీజ్ అయిన మా చిత్రం ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మా సినిమాకి ఇంతలా క్రేజ్ రావడానికి కారణం అనూప్ ఇచ్చిన మ్యూజిక్. చంద్రబోస్ వన్డ్రఫుల్ లిరిక్స్ రాశారు. వారికి నా అబినందనలు. ఈ నెల 29న వరల్డ్‌వైడ్‌గా యువి, జిఏ2 ద్వారా  సినిమా రిలీజ్ అవుతుంది.. అంత పెద్ద సంస్థలు  మా సినిమా విడుదల చేస్తున్నందుకు అదృష్టంగా, గర్వాంగా ఫీలవుతున్నాను. సినిమా చూసిన ప్రేక్షకులు హ్యాపీగా వెళ్తారని గ్యారెంటీగా చెబుతున్నాను.. అన్నారు.
 
దర్శకుడు ఫణి ప్రదీప్ మాట్లాడుతూ.. 'నువ్వేకావాలి, క్షణం, స్వామిరారా'.. చిత్రాల ఇన్స్పిరేషన్ ఈ సినిమా చేయడానికి కారణం. కథ అనుకున్న దగ్గరునుండి ఇప్పటివరకూ మా హీరో ప్రదీప్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. మా నిర్మాత యస్వీ బాబు గారు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి ఈ సినిమాని కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సినిమా చూశాను.. బాగా వచ్చింది. చూసిన మా టీమ్ అంతా కంటతడి పెట్టారు. అంత బాగా కనెక్ట్ అయ్యారు. నీలి నీలి ఆకాశం పాట ఎంత పెద్ద హిట్ అయిందో సినిమా కూడా అంతే హిట్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అనూప్ మ్యూజిక్, చంద్రబోస్ గారి సాహిత్యం బాగా కుదిరింది. వారికి నా థాంక్స్. ఇండస్ట్రీలోని పెద్దలంతా ఫోన్ చేసి నీలి నీలి పాట బాగుందని అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.. అన్నారు.
 
నటి హేమ మాట్లాడుతూ.. ' ఇప్పటి వరకూ కామెడీ పాత్రలు చేశాను. సెంటిమెంట్, ఎమోషనల్ క్యారెక్టర్స్ చేయాలని ఎదురుచూస్తున్న టైములో మున్నా నాకు ఒక మంచి మదర్ క్యారెక్టర్ ఈ చిత్రంలో చేసే అవకాశం ఇచ్చారు. నిర్మాత బాబు గారు అందరికీ బాగా రెస్పెక్ట్ ఇస్తూ బాగా చూసుకున్నారు.. షూటింగ్ అంతా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఈ సినిమా తర్వాత హేమ సెంటిమెంట్ క్యారెక్టర్స్ కూడా చేయగలదు అని అంటారు. మంచి ఎక్స్పీరియెన్స్ కలిగింది. నీలి నీలి పాట ఎంత పెద్ద హిట్ అయిందో సినిమా కూడా అంతకంటే ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిబ్రవరి 19న నితిన్-చంద్రశేఖర్ ఏలేటి 'చెక్' రిలీజ్