Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"ఇది నీ క‌థా" అని అడుగుతున్నారు: జ‌గ‌ప‌తిబాబు

webdunia
  • facebook
  • twitter
  • whatsapp
share
సోమవారం, 18 జనవరి 2021 (17:46 IST)
Father Chitti Uma Karthik
జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి యువ జంటగా ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ సంస్థ‌ శ్రీ రంజిత్ మూవీస్ నిర్మిస్తోన్న 14వ‌ చిత్రం 'ఫాదర్-చిట్టి-ఉమ- కార్తీక్'. టైటిల్‌లోని మ‌రో ప్ర‌ధాన పాత్ర చిట్టిగా బేబి స‌హ‌శ్రిత న‌టిస్తోంది. ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
 
జ‌గ‌ప‌తిబాబు వ్యాఖ్యానిస్తూ...   ఈ సినిమాలో నా పాత్ర గురించి వెల్ల‌డైన విష‌యాలు చూసి, 'ఇది నీ క‌థా?' అని కొంత‌మంది అడుగుతున్నారు. పిల్ల‌ల‌కు ఆట‌లు కావాలి, యూత్‌కు రొమాన్స్ కావాలి, మాకు అన్నీ కావాలి. ఈ సినిమాలో అవ‌న్నీ ఉంటాయి. ప్రేక్ష‌కుల్ని ఈ సినిమా అల‌రిస్తుంది. ప్ర‌ధానంగా నేను యాక్ట‌ర్‌ను, హీరోను కాను. ఈ సినిమా ఆడిందంటే నాకు పండ‌గే. దాము నిర్మించిన 'అలా మొద‌లైంది' సినిమా ప‌దేళ్లను సెల‌బ్రేట్ చేసుకుంటోంది. 
 
నాన్న‌గారు (వి.బి. రాజేంద్ర‌ప్ర‌సాద్‌) నిర్మించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ద‌స‌రా బుల్లోడు' సినిమా ఈ జ‌న‌వ‌రి 13కు 50 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకోవ‌డం హ్యాపీ. నేను యాక్ట‌ర్‌న‌య్యాక ముప్ఫై ఐదేళ్లుగా నాకు అండ‌గా ఉంటూ వ‌స్తున్న ప్రెస్‌కు థాంక్స్ చెప్పుకుంటున్నా" అన్నారు.
 
తదనంతరం ముందుగా నిర్మాత దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ, "ఉద‌య‌మే దొర‌స్వామిరాజుగారి మృతి వార్త విచారం క‌లిగించింది. ఆయ‌న‌తో నాన్న‌గారి (రంజిత్ కుమార్‌)కి ఎంతో అనుబంధం ఉంది. క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ఇండ‌స్ట్రీకి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. అయితే సోలో బ్రతుకే సో బెట‌ర్‌, క్రాక్‌, రెడ్‌, అల్లుడు అదుర్స్ సినిమాల నిర్మాత‌లు ధైర్యం చేసి, థియేట‌ర్ల‌లో వాటిని రిలీజ్ చేయ‌డం, ప్రేక్ష‌కులు అంతే ధైర్యంగా థియేట‌ర్ల‌కు వ‌చ్చి వాటిని చూసి స‌క్సెస్ చేయ‌డం ఇండ‌స్ట్రీలోని వారంద‌రికీ ధైర్యాన్నిచ్చింది. 
 
ఈ విష‌యంలో నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, హీరోల‌కు, ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ చెప్తున్నా. 'ఎఫ్‌సీయూకే' టైటిల్ చూసి కొంత‌మంది వేరే అర్థం వ‌స్తుంద‌ని అన్నారు. అంద‌రికీ ఒక విష‌యం స్ప‌ష్టం చేయ‌ద‌ల‌చుకున్నా. శ్రీ రంజిత్ మూవీస్ ఎప్పుడూ ఎవ‌రూ త‌ల‌దించుకొనే సినిమాలు తియ్య‌దు. సినిమా అనేది వ్యాపార‌మైన‌ప్ప‌టికీ కొన్ని విలువ‌ల‌తో సినిమాలు తీస్తూ వ‌స్తున్నాను. 'ఎఫ్‌సీయూకే' కూడా అట్లాంటి సినిమానే. 
 
నిజానికి 2020 ఏప్రిల్‌లోనే ఈ సినిమాను తెద్దామ‌నుకున్నాం. పాండ‌మిక్ వ‌ల్ల వాయిదాప‌డి ఇప్పుడు రిలీజ్‌కు ప్లాన్ చేశాం. ఫిబ్ర‌వ‌రి 12న సినిమాని విడుద‌ల చేస్తున్నాం అన్నారు. అలాగే మేం నిర్మించిన 'అలా మొద‌లైంది' చిత్రం విడుద‌లై జ‌న‌వ‌రి 21కి ప‌దేళ్లు పూర్తి చేసుకుంటోంది. నా లైఫ్‌లో ఆ సినిమా ఓ ట్యాగ్‌లైన్‌లా మారిపోయింది. ఆ సినిమా అంత పెద్ద హిట్ట‌వ‌డానికి కార‌ణం మీడియా." అన్నారు.
 
ప్ర‌ధాన పాత్ర‌ధారి జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ, "దొర‌స్వామిరాజుగారితో నేను క‌లిసి ప‌నిచేశాను. ఆయ‌నంటే నాకు చాలా ఇష్టం. ఆయ‌న పోవ‌డం ఎంతో బాధాక‌రం. దాము (దామోద‌ర్ ప్ర‌సాద్‌) మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూస‌ర్‌. విద్యాసాగ‌ర్ రాజు క‌న్విక్ష‌న్ ఉన్న డైరెక్ట‌ర్‌. ఈ సినిమాని చాలా బాగా తీశారు. ఈ సినిమాలో కార్తీక్ హీరో. సిన్సియారిటీతో న‌టించాడు. నేనొక ప్ర‌ధాన పాత్ర పోషించాను. ఈ సినిమాలో నా పాత్ర గురించి వెల్ల‌డైన విష‌యాలు చూసి, 'ఇది నీ క‌థా?' అని కొంత‌మంది అడుగుతున్నారు. పిల్ల‌ల‌కు ఆట‌లు కావాలి, యూత్‌కు రొమాన్స్ కావాలి, మాకు అన్నీ కావాలి.
 
ఈ సినిమాలో అవ‌న్నీ ఉంటాయి. ప్రేక్ష‌కుల్ని ఈ సినిమా అల‌రిస్తుంది. ప్ర‌ధానంగా నేను యాక్ట‌ర్‌ను, హీరోను కాను. ఈ సినిమా ఆడిందంటే నాకు పండ‌గే. దాము నిర్మించిన 'అలా మొద‌లైంది' సినిమా ప‌దేళ్లను సెల‌బ్రేట్ చేసుకుంటోంది. నాన్న‌గారు (వి.బి. రాజేంద్ర‌ప్ర‌సాద్‌) నిర్మించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ద‌స‌రా బుల్లోడు' సినిమా ఈ జ‌న‌వ‌రి 13కు 50 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకోవ‌డం హ్యాపీ. నేను యాక్ట‌ర్‌న‌య్యాక ముప్ఫై ఐదేళ్లుగా నాకు అండ‌గా ఉంటూ వ‌స్తున్న ప్రెస్‌కు థాంక్స్ చెప్పుకుంటున్నా" అన్నారు.
 
డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ రాజు మాట్లాడుతూ, "ప్రేక్ష‌కులు సినిమాని చూసి ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా. ఇది బాగా ఎంట‌ర్‌టైన్ చేసే సినిమా" అని చెప్పారు. హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, "ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల కానందుకు బాధ‌గా ఉన్నా, ఫిబ్ర‌వ‌రి 12న రిలీజ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు జ‌గ‌ప‌తిబాబుగారి బ‌ర్త్‌డే, దాముగారి బ‌ర్త్‌డే. జ‌గ‌ప‌తిబాబు గారితో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం చాలా హ్యాపీ. ఆయ‌న ఇచ్చిన ప్రోత్సాహం, సూచ‌న‌లు మ‌ర‌వ‌లేను." అన్నారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో సినిమాటోగ్రాఫ‌ర్ శివ జి., స‌హ‌నిర్మాత య‌ల‌మంచిలి రామ‌కోటేశ్వ‌ర‌రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ శ్రీ‌కాంత్‌రెడ్డి పాతూరి, లైన్ ప్రొడ్యూస‌ర్ వాసు ప‌రిమి, ఇత‌ర యూనిట్ మెంబ‌ర్స్ పాల్గొన్నారు.
 
తారాగ‌ణం:
జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌.
 
సాంకేతిక బృందం:
మాటలు:ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం: శివ జి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్
పాటలు: ఆదిత్య,కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి

Share this Story:
  • facebook
  • twitter
  • whatsapp

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

webdunia
నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా కొత్త బిజినెస్‌ ఏంటో తెలుసా?