Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

ఠాగూర్
ఆదివారం, 22 జూన్ 2025 (15:09 IST)
సినిమాల్లో తాను ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో ఇష్టమైన క్యారెక్టర్ గురించి ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పోషించిన పాత్రల్లో పూర్తి స్థాయిలో నా మనసుకు చేరువైంది ఏదీ లేదు. ప్రతి పాత్రలో కొన్ని లక్షణాలు మాత్రమే నచ్చాయి. నిజ జీవితంలో ఎలా ఉంటానో అదేవిధంగా వెండితెరపైనా కనిపించాలని ఉంది. కానీ అది సినిమాల్లో సాధ్యపడకపోవచ్చు. ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించకపోవచ్చు అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 
 
సినిమాల్లో అడుగుపెట్టాలని, నటుడుగా మారాలని ఎపుడూ అనుకోలేదు. మాదొక మధ్య తరగతి కుటుంబం. నా నాన్న ప్రభుత్వం ఉద్యోగి. కమ్యూనిస్టు భావాలను పాటించేవారు. ఆయన వల్లే మా కుటుంబ సభ్యులకు రాజకీయాలపై అవగాహన వచ్చింది. నేను అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటికీ సమాజంపైనే నా దృష్టి ఉండేది. ఆ ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టా అని తెలిపారు. 
 
'దంగల్' వంటి చిత్రాలు ఇపుడు రావడం లేదు. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వారు కథలు అందించలేకపోతున్నారు అని పవన్ పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో "ఉస్తాద్ భగత్ సింగ్", సుజీత్ డైరెక్షన్‌లో "ఓజీ" చేస్తున్నారు. ఈ రెండూ చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఆయన హీరోగా నటించిన "హరి హర వీరమల్లు" రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. క్రిష్, జ్యోతికృష్ణలు రూపొందించారు. ఈ చిత్రం జూలై 24వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకునిరానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: చంద్రబాబుపై జగన్ విమర్శలు.. 14 నెలలు గడిచినా హామీలు నెరవేర్చలేదు..

తూచ్... నేను అలా అనలేదు.. 75 యేళ్ల రిటైర్మెంట్‌పై మోహన్ భగవత్

సుగాలి ప్రీతి కేసులో పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా వుంది : పవన్ కళ్యాణ్ వీడియో

Family Card: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇంటికి కుటుంబ కార్డు జారీ చేస్తాం: చంద్రబాబు నాయుడు

మిక్సీ వైరును గొంతుకు బిగించి భార్యను చంపేసిన తాపీమేస్త్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments